Just In
- 9 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 30 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ రాత్రి కారు టైర్ పంక్చర్.. గ్రామస్థుల వద్దకు వెళ్ళగానే! ఒక్కమాటలో చెప్పేసిన రేణు దేశాయ్
ఒకప్పటి మోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు రేణు దేశాయ్. కాకపోతే వీటికంటే ఎక్కువగా ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే పాపులారిటీ తెచ్చుకుంది. ఎవ్వరైనా రేణు దేశాయ్‌ని పవన్ మాజీ భార్య గానే సంభోదిస్తుండటం చూస్తున్నాం. కాగా తాజాగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పెట్టిన ఓ మెసేజ్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా మెసేజ్? వివరాల్లోకి పోతే..

రేణు దేశాయ్ కోరిక.. షూటింగ్ అయ్యాక కారులో!
రేణు దేశాయ్‌కి ఎప్పటి నుంచో ఓ కోరిక ఉండిపోయిందట. అది ఇలా, ఇప్పుడు తీరందంటూ ఆ విశేషాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది రేణు. తాను రూపొందిస్తున్న ఫిల్మ్ షూటింగ్ హైదరాబాద్‌కి దూరంగా చేస్తోందట. అయితే ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌కి కారులో బయల్దేరిన ఆమె ఓ గ్రామంలో ఆగిందట.

కారు టైర్ పంక్చర్.. వెంటనే కారు దిగి
కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్ సమీపిస్తుండగానే తన ప్రొడక్షన్ డిజైనర్‌తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట రేణు. ఆమె అలా అందో లేదో అప్పుడే కారు టైర్ పంక్చర్ అయిందట. దీంతో వెంటనే కారు దిగిన ఆమె తెగ సంబరపడి వెంటనే ఆ రాత్రివేళ అక్కడి గ్రామస్థులను కలిసిందట.
|
తినడానికే తిండి లేదు కానీ..
అయితే ఆ గ్రామస్థులు ఆమెను రిసీవ్ చేసుకున్న తీరు తనకి బాగా నచ్చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. ఆ గ్రామస్థులకు తినడానికే సరిపడా తిండి లేదు. అయినప్పటికీ వాళ్లు తనకు ఉప్మా, టీ పెట్టారు. రేణు కోసం చలిమంట వేశారు. ఆ రాత్రి ఆ పేద కుటుంబాలతో కలిసి హాయిగా నిద్రపోయిన రేణు దేశాయ్ ఆ ఫోటోలను కూడా పంచుకుంది.

ఎంత డబ్బున్నా ఏం లాభం? చాలా నేర్చుకోవాలి
ఈ మేరకు ఆ రోజు అనుభవాలను పంచుకుంటూ.. "మన దగ్గర ఎంత డబ్బున్నా ఏం లాభం? దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా నాకు ఎన్నో ఇచ్చారు. అలాంటి వాళ్ళ దగ్గరనుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అంటూ ఆ పేద కుటుంబాల గొప్పదనాన్ని చెప్పింది రేణుదేశాయ్.
|
రెండో పెళ్లికి సిద్ధం.. రేణు స్వయంగా!
మరోవైపు పవన్ భార్యగా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, తాను రెండో పెళ్లికి సిద్దమయ్యానని చాలా రోజుల క్రితమే రేణు స్వయంగా ప్రకటించింది. ఇది జరిగి ఏడాది గడిచినా ఆమె పెళ్లి సంగతి మాత్రం బయటకు రాలేదు. దీంతో ఇక రేణుదేశాయ్ పెళ్లి చేసుకోదు అనే వార్తలు పుట్టుకొస్తున్నాయి.