పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, సినీనటులు రజనీకాంత్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు.
ఇకపోతే.. అకీరా నందన్ గడిచిన కొద్దిరోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టాడు. కూటమి ఘన విజయం సాధించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో పవన్, ఆయన సతీమణి అన్నా లెజ్‌నొవా, అకీరా నందన్ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు అభినందించి, ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కాళ్లకు నమస్కరించాల్సిందిగా అకీరాను పవన్ ఆదేశించగా.. పెద్దాయన కాళ్లు మొక్కాడు అకీరా.

అప్పుడే కాదు.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి, కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన అనంతరం పవన్ తొలిసారిగా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఆ సమయంలోనూ భార్య అన్నా లెజ్‌నొవా, కుమారుడు అకీరాలు పవన్ వెంటే ఉన్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చిరంజీవి, నాగబాబు, సాయిధరమ్ తేజ్, రామ్ చరణ్, అకీరా, ఆద్య, నిహారిక తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. పవన్ వేదిక పైకీ వచ్చినప్పుడు వీరంతా మిగిలిన అభిమానుల్లాగే కేరింతలు కొట్టారు. పవన్ మాజీ భార్య , సినీనటి రేణూ దేశాయ్ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అకీరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. అకీరా, ఆద్య ఫోటోలను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన బిడ్డలిద్దరూ ప్రమాణ స్వీకార వేదిక నుంచి తనకు వీడియో కాల్ చేసినట్లు రేణు తెలిపారు. వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకు రెడీ అయ్యారు.. ఏపీకి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేణూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, దాదాపు 6.4 హైట్‌తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్‌లా ఉండే అకీరా నందన్‌లో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉండటంతో అతను ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని మెగా, పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్‌పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. పియానోను అద్భుతంగా ప్లే చేయగల అకీరా నందన్ .. తన స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











