మగాడి గుర్తింపు అవసరం లేదు.. ఆ విషయంలో ఒంటరిగానే పోరాడా: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ సోషల్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే సామాజిక అంశాలపై స్త్రీ శక్తి గురించి కూడా ఆమె చా ఇంట్రెస్టింగ్ గా వివరిస్తారు. ఇక ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో స్త్రీ యొక్క శక్తి గురించి అలాగే వారి యొక్క స్థానం, గుర్తింపు అంశాలను గురించి వివరించారు.

పర్సనల్ లైఫ్ కోసం..

పర్సనల్ లైఫ్ కోసం..

బద్రి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ ఆ తరువాత పెద్దగా హీరోయిన్ గా బిజీ అయ్యింది లేదు. తన పర్సనల్ లైఫ్ కోసం నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా బిజీ అయ్యారు. అలాగే రచయితగా దర్శకురాలిగా కూడా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

స్పెషల్ పోస్ట్..

స్పెషల్ పోస్ట్..

ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె సొంతంగా తన పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం అధ్యా, అకిరా నందన్ కి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తుంటారు. ఇక రీసెంట్ గా ఒక స్పెషల్ పోస్ట్ తో ఎంతగానో ఆలోచింపజేశారు.

ఒంటరిగానే పోరాడాలని..

ఒంటరిగానే పోరాడాలని..

'నేను ఏదైనా సరే ఒంటరిగానే పోరాడాలని అనుకుంటాను. ఇతరులపై ఆధారపడకుండా ఫ్యామిలీని చూస్కుంటున్నాను, వ్యాపారం చేయగలను. ఆర్థికంగా దృఢంగా నిలబడగలను. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనగలిగేందుకు సిద్ధంగా ఉండాలి. నన్ను అనుసరించి స్వతత్రంగా బ్రతకలని అనుకునే యువతులకు నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
 అలా ఉండడం గొప్ప కాదు

అలా ఉండడం గొప్ప కాదు

ఆడవాళ్ళు దుర్గా దేవి, లక్ష్మీ సరస్వతిలా ఉండాలి. మీకున్న బలాన్ని, సామర్థ్యం గురించి పూర్తిగా తెలుసుకోండి. వేరొకరి భార్యగానో లేక కూతురి గానో గుర్తింపు ఉండడం గొప్ప కాదు. మీకంటూ ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అయితే ఈ క్రమంలో మన సాంప్రదాయాలను పూర్తిగా మర్చిపోకూడదు. ఆ ముసుగులో జరిగే అన్యాయలపై పోరాడాల్సిన అవసరం ఉంది అని రేణూ దేశాయ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X