twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ స్పెషల్ గిఫ్ట్.. కంటతడి పెట్టిన రేణు దేశాయ్

    |

    గ్లామరస్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా కూడా సుమ ఎంట్రీ ఇస్తే ఎవరైనా సరే సైడవ్వాల్సిందే. సినిమా వేడుకలైనా గేమ్ షోలైనా కూడా ఆమె ఆడియెన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో అందరికి ఆత్మ బందువుగా మారిన సుమ పలుమార్లు ఎమోషనల్ గా కూడా ఆడియెన్స్ హార్ట్ ని టచ్ చేస్తూ ఉంటారు. ఇటీవల సుమక్క షో నుంచి విడుదలైన ఒక ప్రోమో కూడా ఎంతగా నవ్వించిందో అదే స్థాయిలో ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు కూడా.. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    సుమక్క వంట ప్రోగ్రామ్

    సుమక్క వంట ప్రోగ్రామ్

    యాంకర్ సుమ తన కెరీర్ లో అత్యదిక గ్యాప్ తీసుకుంది ఒక్క లాక్ డౌన్ లోనే. షూటింగ్స్ ఈవెంట్స్ లేకపోబడంతో ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇక సుమక్క అనే యూ ట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసుకున్న సుమ ఇంట్లోనే బాగా డెవలప్ చేసింది. స్టార్స్ తో ఆన్ లైన్ లోనే కామెడీ ట్రాక్స్ నడిపించి బాగా హైప్ క్రియేట్ చేశారు కూడా. రీసెంట్ గా ఈట్ టాక్ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు.

    రేణు దేశాయ్ బర్త్ డే స్పెషల్

    రేణు దేశాయ్ బర్త్ డే స్పెషల్

    మొన్నటి వరకు జబర్దస్త్ పటాస్ వంటి కమెడియన్స్ తో వంటలు చేయించారు. అలాగే యాంకర్స్ కాస్త హడావుడి చేసిన సుమ ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయి సెలబ్రెటీలను పిలిచి వారితో సరదాగా గడిపేస్తూ వంటలతో తన వ్యూవ్స్ ను పెంచుకుంటోంది. అందుకు సంబంధించిన ప్రోమోలతోనే చానెల్ రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇక ఈ నెల 4న రేణు దేశాయ్ పుట్టినరోజు కావున ఆమె బర్త్ డే కోసమని ప్రోగ్రామ్ చేయించింది సుమక్క.

    ఆధ్యకు పెద్దమ్మ సుమ

    ఆధ్యకు పెద్దమ్మ సుమ

    రేణు దేశాయ్ తో ఒక స్పెషల్ కేక్ రేడి చేయించింది సుమక్క. ఇక ప్రోగ్రాం మధ్యలో ఆమె పంచ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే రేణు దేశాయ్ కూడా సుమక్క అంటూ ఆట పట్టించింది. పైగా ఆధ్యకు నువ్వు పెద్దమ్మ అవుతావ్ అంటూ పంచ్ వేయడంతో సుమ తట్టుకోలేక మొహం తిప్పేసుకొని నవ్వేసింది.

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    కంటతడి పెట్టించిన సుమక్క కానుక

    కంటతడి పెట్టించిన సుమక్క కానుక

    ఇక చివరలో రేణు దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు వివిధ రకాల పుట్టినరోజు కానుకలు ఇచ్చింది సుమ. ఇక ఆధ్య, అకిరాతో ఫోటో తో కూడిన కాఫీ కప్ ఇవ్వడంతో ఒక్కసారిగా రేణు దేశాయ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. ఎందుకు నన్ను ఎడిపిస్తున్నారు సుమ గారు అంటూ కంటతడి పెట్టుకుంది. అందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫుల్ ప్రోగ్రాంను రేణు దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

    English summary
    Television Best Anchor is the only name that everyone remembers, Suma. No matter how many hot anchors and cute anchors there are, Suma continues to top the list with her words. Apart from punching at the right timing, they continue to be responsible for adapting to the event. It is a well known fact that her earnings are much higher than that of her husband Rajiv Kanaka. And for the first time Rajiv .. It is good to say that his earnings are kind of too high.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X