Pawan Kalyan నాకు చేసింది మోసమే.. అయినా ఆయనకే నా సపోర్ట్.. మూడు పెళ్లిళ్ల సినిమాల గురించి Renu Desai వీడియో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ భార్యభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక పవన్ మూడో పెళ్లి చేసుకుని... అటు రాజకీయాలతో, సినిమాలతో బిజి బిజిగా గడుపుతున్నారు. మరోవైపు రేణు దేశాయ్ ముంబైలో తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ గురించి ఓ సెన్సెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో పవన్ గురించి, పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటి భార్య నందినితో విడిపోయాక.. పవన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బద్రి సినిమాతో పరిచయం అయిన ముంబాయి భామ రేణు దేశాయ్... పవన్ ప్రేమలో పడి.. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యా కూడా పుట్టారు. అయితే ఏమైందో తెలియదు.. వీరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు.

ఇక పవన్ విడాకుల అనంతరం... కొన్నేళ్లకు రష్యన్ భామ అన్నా లెజెనెవాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా పవన్ పెళ్లిళ్లపై దుమారం రేగుతోంది. దానికి కారణం పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే. ప్రతి పక్షాలు.. పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ... మూడు పెళ్లిళ్లు అంటూ హేళన చేస్తున్న సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా పవన్ పెళ్లిళ్లపై ఏపీ మంత్రులు... వెబ్ సిరీస్ లు, సినిమాలు తీస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ సెన్సేషనల్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ... ''పవన్ కల్యాణ్ తో వైవాహిక జీవితంలో సమస్యలొచ్చాయి. నిజమే, నేను బాధపడ్డాను. కానీ, అది ముగిసిన కథ..'' అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో ఒక సినిమా అనుకోకుండా వివాదాలకు దారితీసింది. అయితే అందులో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే నేను దేశంలోనే లేను. నేను తిరిగి ఇండియాకు వచ్చే సరికి.. జరిగిన విషయం తెలిసింది. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం తన మాజీ భర్తతో ఎవరికైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వారు.. ఒక తల్లిగా నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నా... రాజకీయ పరంగా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుోకండి.
కానీ పిల్లల్ని లాగొద్దు... ఫ్యాన్స్ కానివ్వండి హేటర్స్ కానివ్వండి సపోర్టర్స్ కానివ్వండి దయచేసి పిల్లల్ని ఇందులోకి లాగొద్దు. కేవలం నా పిల్లల్ని కాదు ఏ పొలిటికల్ లీడర్ పిల్లల్ని సినిమా నటీనటుల పిల్లల్ని కూడా ఈ విషయాల్లోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి గాని పిల్లలు, భార్యల జోలికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక పవన్ తన విషయంలో చేసింది తప్పేనని ఇప్పటికీ 100 శాతం చెబుతున్నానని అంటూనే పొలిటికల్ గా అలాగే సమాజానికి ఆయన ఉపయోగపడతారని కూడా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికీ చెబుతున్నా.. కుటుంబాన్ని కాదనుకుని.. సొంత పిల్లల్ని కూడా కాదనుకుని.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని.. ప్రజల కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు.సమాజానికి మంచి చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ కు అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ మద్దతిస్తా... నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. ఇలా ఈ వీడియో చేస్తున్నది కూడా అదే. పవన్ అభిమానించేవారు కూడా.. రాజకీయాల్లో ఆయనకు అండగా నిలబడండి' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











