ఆర్ఆర్ఆర్ సెట్లో గణతంత్ర వేడుకలు.. పిక్స్ వైరల్

దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి లాంటి చిత్రం తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ విశేషాల గురించి తెలియని సినీ ప్రేక్షుకుడు ఉండడు. ఈ కథ ఏంటి? ఈ సినిమాలో ఏం చెప్పబోతోన్నాడో పూసగుచ్చినట్టు వివరించాడు రాజమౌళి. ఈ చిత్రం స్వాతంత్ర్యం రాక పూర్వం జరిగిన కథ. స్వతంత్ర సమరంలో పోరాడి నేలకొరిగిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ వంటి యోధుల కథ ఆధారంగా తీస్తున్న కాల్పనిక కథ అని చెప్పేశాడు.

ఈ చిత్రం దేశభక్తికి సంబంధించిన అంశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి అయిందని చిత్రయూనిట్ పేర్కొంది. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై తెరకెక్కించే ఈ సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని టాక్. వీటికి సంబంధించి తాజాగా ఓ పిక్ కూడా లీకైంది. ఈ యంగ్ టైగర్.. ఓ పులితో ఫైట్ చేస్తాడంటా.

Republic Day Celebrations In RRR Set

దేశ వ్యాప్తంగా గణతంత్ర్య వేడుకలు మిన్నంటగా.. ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిపాయి. ఆర్ఆర్ఆర్ సెట్లో రాజమౌళి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ జరిగాయని, ఈ మేరకు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మూవీని జూలై 30న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X