రీ షూట్ జరుపుకుంటున్న రామ్ సినిమా!
యంగ్ హీరో రామ్ నటిస్తున తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే. నేను లోకల్ ఫేం త్రినాధ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో కొన్ని కీలకమైన సన్నివేశాలని రీషూట్ చేస్తునట్లు తెలుస్తోంది. అవుట్ పుట్ మరింత బెటర్ గా రావడం కోసమే రీషూట్ జరుపుతునట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల వచ్చిన శ్రీనివాస కళ్యాణం, లవర్ వంటి చిత్రాలు నిరాశ పరిచాయి.

హలో గురు ప్రేమకోసమే జీవితంలో రామ్ సరసన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అనుపమ, రామ్ కలసి నటించడం ఇది రెండో సారి. ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో వీళ్ళిద్దరూ కలసి నటించారు.


Click it and Unblock the Notifications











