ప్రభాస్ కోసం రంగంలోకి దిగిన ఆస్కార్ అవార్డ్ విన్నర్: ఫొటో షేర్ చేసి రివీల్ చేసిన డైరెక్టర్
పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. ఆ తర్వాత 'సాహో' అనే యాక్షన్ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుని పోతున్నాడు. ఇక, యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి.
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రాధే శ్యామ్' చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్‌కు బ్రేక్ పడిపోయింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పటి వరకూ ఫస్ట్ కాపీని రెడీ చేయలేకపోయారు. అయినప్పటికీ అన్ని పనులనూ వేగంగా జరుపుతున్నారు. అలాగే, మధ్య మధ్యలో కొన్ని అప్‌డేట్లను కూడా ఇస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలను పెంచుకుంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేసింది. అలా ఇప్పటికే పలు పాటలను, గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఎన్నో రికార్డులు కూడా సొంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఈవెంట్‌ను నిర్వహించి మరీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుని నేషనల్ రేంజ్‌లో రికార్డులు నమోదు చేసుకుంది.

ప్రభాస్ 'రాధే శ్యామ్' మూవీ విడుదలకు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సౌండ్ అండ్ డీటీఎస్ మిక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టిని తీసుకున్నారు. ఆయన ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. దీన్ని వెల్లడిస్తూ తాజాగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, జగపతి బాబు, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











