Shaakuntalam first Review.. సమంత ఎలా చేసింది? క్రిటిక్ ఇచ్చిన రేటింగ్ ఎంతంటే?
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమా గుణ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నాయి. దాంతో 3డీలో రూపొందిన ఈ సినిమాపై మంచి క్రేజ్, అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఇచ్చిన రివ్యూ వివరాల్లోకి వెళితే..
పురాణాల ఆధారంగా : పురాణాల ఆధారంగా, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతలం గ్రంథం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్, కణ్వ మహర్షిగా సచిన్ ఖేడ్కర్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, అనసూయగా అనన్య నాగళ్ల, సారంగిగా ప్రకాశ్ రాజ్, గౌతమిగా గౌతమి, కష్యప మహర్షిగా కబీర్ బేడీ నటించారు. ఇంద్రుడిగా జిషు సేన్ గుప్తా, ప్రిన్స్ భరతుడిగా అల్లు అర్హ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.

భారీ బడ్జెట్‌తో శాకుంతలం : శాకుంతలం సినిమాను దృశ్య కావ్యంగా మలచడానికి ప్రపంచంలోనే ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థతో గ్రాఫిక్స్ చేయించాం. జంతువులు, అడవులను సృష్టించిన తీరు తెరపైన అద్బుతంగా ఆవిష్కృతమైంది. దాదాపు ఏడాదిన్నర ఈ సినిమా కోసం పనిచేశాం. భారీ బడ్జెట్ అవుతుందని తెలిసినా క్వాలిటీ సినిమాను అందించాలనే ఉద్దేశంతో వెనుకాడలేదు అని గుణశేఖర్ తెలిపారు.

అద్బుతంగా సెట్స్, వీఎఫ్ఎక్స్ : శాకుతలం సినిమాను హిమాలయాల్లో చిత్రీకరించడానికి ప్రయత్నించాం. కానీ హిమాలయాల్లో నాగరికత పెరగడంతో మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. భవనాలు, కాంక్రిట్ ప్రపంచం మా సినిమాకు అనుకూలంగా లేకపోవడం వల్ల భారీ సెట్లు వేసి.. అద్బుతంగా షూట్ చేశాం అని గుణశేఖర్ తెలిపారు.

ఉమేర్ సంధూ రివ్యూ : ఇలాంటి హంగులతో రిలీజ్‌కు సిద్దమైన శాకుంతలం సినిమాను దుబాయ్‌లో సెన్సార్ సందర్భంగా క్రిటిక్ ఉమేర్ సంధూ సినిమాను చూసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా భారీగా నిర్మించడం అద్భుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్‌లో పెట్టిన బడ్జెట్ కనిపిస్తుంది. భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ పనితనం తెర మీద కనిపిస్తుంది అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో తెలిపారు.
సమంత అదరగొట్టింది అంటూ : శాకుంతల పాత్రలో సమంత ఒదిగిపోయింది. ఆ పాత్రలో ఆమె అద్బుతంగా కనిపించింది. ఆ పాత్ర కోసం పెట్టిన ఆమె చూపిన అంకితభావం, ఫెర్ఫార్మెన్స్ సినిమాలో కనిపిస్తుంది. పక్కాగా శాకుంతలం సినిమా పైసా వసూల్ అని చెప్పవచ్చు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు వాస్తవానికి దూరంగా ఉంటాయనేది పలు చిత్రాలు ఫలితాలు స్పష్టం. భారీ రేటింగ్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడ్డాయి శాకుంతలం విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడండి. త్వరలోనే ఫిలింబీట్ రివ్యూ వస్తుంది.


Click it and Unblock the Notifications











