twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను లగడపాటి రాజ్ గోపాల్ కలిసి కొట్టాం.. ఆ గొడవ తరువాత ఏం జరిగిందంటే: RGV

    |

    కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనమే అని అందరికి తెలిసిన విషయమే. మాటలతో పాటు అప్పుడప్పుడు చేతలతో కూడా షాక్ ఇస్తుంటారు. ఇక ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ లలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసే వర్మ నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన విషయాన్ని కూడా బయటపెడుతుంటారు.

    కరోనా టైమ్ లోనే ఓటీటీ

    కరోనా టైమ్ లోనే ఓటీటీ

    సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నమైన శైలిలో తెరకెక్కిస్తాడు. ఇక ఆయన ప్రమోషన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా టైమ్ లోనే ఓటీటీ సినిమాలతో బిజీబిజీగా గడిపారు. అలాగే కరోనా టైటిల్ తోనే ఒక సినిమాను విడుదల చేశారు.

    ఒకనొక సమయంలో

    ఒకనొక సమయంలో

    ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గొడవల గురించి కూడా వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది. ఒకనొక సమయంలో లగడపాటి రాజగోపాల్ తో కలిసి మరొక గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తిని చితకబాదునట్లు కూడా చెబుతూ ఒకప్పటి గొడవలను గుర్తు చేసుకున్నారు.

    లగడపాటి రాజ్ గోపాల్ కూడా

    లగడపాటి రాజ్ గోపాల్ కూడా

    విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్న రామ్ గోపాల్ వర్మకు ఒకప్పటి క్లాస్మేట్స్ లలో మాజీ రాజకీయా నాయకులు లగడపాటి రాజ్ గోపాల్ కూడా ఉన్నారు. రాజ్ గోపాల్ తో కలిసి అప్పట్లో చాలా ప్లేస్ లు తిరిగినట్లు చెప్పిన వర్మ కలిసి గొడవలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు.

    కొట్టించిన సందర్బాలు కూడా ఉన్నాయి

    కొట్టించిన సందర్బాలు కూడా ఉన్నాయి

    మొదటి సారి నేను గోడవపడింది సిద్ధార్థ కాలేజ్ లోనే. అక్కడ లోకల్, నాన్ లోకల్ అనే గ్యాంగ్స్ ఎక్కువగా ఉండేవి. కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కొట్టించిన సందర్బాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేను లగడపాటి రాజ్ గోపాల్ ఒక విషయంలో ఒక నాన్ లోకల్ పర్సన్ ని కలిసి కొట్టాము. 1983, 84లలో ఇలాంటి గొడవలు చాలా జరిగేవి.. అని చెప్పారు.

    Recommended Video

    Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
    మోస్ట్ డేంజరస్..

    మోస్ట్ డేంజరస్..

    గొడవలు అయిన సందర్బల్లో నన్ను పోలీస్ స్టేషన్ లాకప్ లో కూడా వేశారు. అప్పుడు మా నాన్న, మా కజిన్ పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది. నేను ఆ టైమ్ లో ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చూసేవాన్ని. నాంచాక్ ను చూసి ప్రిన్సిపల్ మా పేరెంట్స్ కు కంప్లైట్ చేశాడు. ఈ అబ్బాయి మోస్ట్ డేంజరస్ వేపన్స్ వాడుతున్నాడు.. అని చెప్పేవారు.. అంటూ ఆర్జీవి వివరణ ఇచ్చారు.

    English summary
    Typical director Ram Gopal Varma is coming up with another different film. RGV, which is intimidating with crime thriller stories as well as horror movies, is coming up with a ghost story after a long time. It's been a long time since a horror movie came out of this director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X