రేవు పార్టీలో ఆర్జీవీ, అనన్య నాగళ్ల హల్‌చల్ .. కిక్కించేలా ఉందంటూ నిర్మాత కామెంట్
పార్టీలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని వివాదాలు సృష్టిస్టుంటాయి. రేవు పార్టీ అనగానే అదదో అనుకోకండి. తాజాగా కంటెంట్‌తోపాటు ప్రతిభావంతులైన టీమ్ రూపొందించిన చిత్రం రేవు. గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటీనటులు ఈ చిత్రంలో నటించారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగగా ఆర్జీవి, అనన్య నాగళ్ల, మురళీమోహన్, సంపతి నంది తదితరులు హాజరయ్యారు. ఆ పార్టీలో వారు చేసిన సందడి వివరాల్లోకి వెళితే..
రేవుల దగ్గర జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం. స్టార్స్ ఉన్న సినిమా హిట్ కావడం కంటే.. కొత్తవాళ్ల సినిమా హిట్ కావడం ఆ కిక్కే వేరు అని మురళీ మోహన్ అంటారు. పర్వతనేని రాంబాబు, జర్నలిస్టు ప్రభుకు బెస్టాఫ్ లక్ అన్నారు.

దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నప్పుడు మచిలీపట్నం రేవుకు వెళ్లేవాడిని. అయితే అక్కడ మత్స్యకారుల బాధలు చూసేందుకు కాదు అక్కడ చేపలు అమ్మే వారిని చూసేందుకు. రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. దర్శకుడు హరినాథ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ అని అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. రేవు సినిమా టైటిల్ వినగానే చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ కాన్సెప్టులో రేవు సినిమా పార్టీ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి. ప్రతీ ఒక్కరికి మంచి పేరు తీసుకు రావాలి అని అన్నారు.

దర్శకుడు సంపత్ నంది మట్లాడుతూ.. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి నాకు క్లాస్ మేట్. ఆయన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. రేవు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. నాకు మంచి మిత్రుడైన RGV గారు, నా గురు సమానులు మురళి మోహన్ గారు ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వారు. వారి స్పూర్తితో నేను సినిమా చేశానని అన్నారు.


Click it and Unblock the Notifications











