twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘థ్రిల్లర్’ షురూ.. బాస్ ఎప్పుడూ కరెక్ట్.. హీరోయిన్ హాట్ స్టిల్ వైరల్

    |

    రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా పబ్లిక్‌గా, ధైర్యంగా చేస్తాడు. ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. నిర్మోహమాటంగా అనిపించింది చెప్పడమే వర్మ స్టైల్. అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేసే యాంకర్లను సైతం లైవ్‌లో పొగిడేస్తాడు.. అవసరమైతే అక్కడే అడిగేస్తాడు. ఇంకా నచ్చితే ఆఫర్ కూడా ఇస్తాడు. వర్మకు ఆడవారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయం అర్దరాత్రి ఆయన్ను లేపి అడిగిన చెబుతాడు. అంతలా స్త్రీలను ఆరాధించే వర్మ.. వారి సౌందర్యాన్ని ప్రేమిస్తాడు, ఆకాంక్షిస్తాడు. తాజాగా తన కొత్త సినిమా హీరోయిన్‌తో వర్మ పెట్టిన ముద్దూ ముచ్చట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

     స్పీడ్ పెంచిన వర్మ..

    స్పీడ్ పెంచిన వర్మ..

    లాక్ డౌన్‌లో మిగతా దర్శక నిర్మాతలంతా చేతులు ముడుచుకుని కూర్చుంటే వర్మ మాత్రం శరవేగంగా దూసుకుపోతున్నాడు. వరుసగా చిత్రాలను నిర్మిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వేడి ఇంకా తగ్గలేదు. మరో చిత్రంతో వేడి పెంచేందుకు సిద్దమయ్యాడు. మియా మాల్కోవా, స్వీటీ (శ్రీ రాపాక) అందాలకు తడిసిపోయిన ప్రేక్షకులకు.. ఈ సారి మరో అందాన్ని తనదైన శైలిలో పరిచయం చేయబోతోన్నాడు.

    కలిసి రాని చిత్రాలు..

    కలిసి రాని చిత్రాలు..

    అప్సర రాణి గతంలో ఊల్లాలా ఊల్లాలా, 4 లెటర్స్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమాలతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ వర్మ మాత్రం ఆమెలోని అందాలను కనిపెట్టాడు. ఆ సమయంలో వర్మ ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమెను వాడే సమయం వచ్చినట్టు తెలుస్తోంది.

    వర్మ పరిచయం చేయడంతో..

    వర్మ పరిచయం చేయడంతో..

    తన తదుపరి చిత్రం థ్రిల్లర్ హీరోయిన్ అప్సర రాణి అని పరిచయం చేయడంతో.. ఆమెకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరగిపోతూ ఉండటంతో ఆనందంలో తేలిపోయింది. ఇదే విషయాన్ని ఆమె అర్దరాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపింది. వాటికి ఆర్జీవీ సైతం రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

    షూటింగ్ ప్రారంభం..

    షూటింగ్ ప్రారంభం..

    థ్రిల్లర్ షూటింగ్‌ నిన్న(జూన్ 6) రాత్రి ప్రారంభిచినట్టు తెలుస్తోంది. సెట్స్‌లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అర్దరాత్రి కూడా ఓ ట్వీట్ చేయడం, ఫోటో షేర్ చేయడంతో వర్మకు ఓ డౌట్ వచ్చిందంటా. ఆ ఫోటోను ఎవరూ తీశారని వర్మ అడగ్గా.. తన అమ్మ ఆ ఫోటోను క్లిక్ చేసిందని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    లొకేషన్‌లో స్టిల్స్..

    లొకేషన్‌లో స్టిల్స్..

    వర్మ తనలోని కోణాలను ఇంతకు ముందు క్లైమాక్స్, నగ్నం చిత్రాల్లోనే చూపించాడు. తాజాగా థ్రిల్లర్ మూవీ స్టిల్స్‌ను కూడా షేర్ చేశాడు. షూటింగ్ సెట్స్‌లో భాగంగా ఆప్సర హాట్ స్టిల్‌ను ఆమె డైలాగ్‌ను ట్వీట్ చేశాడు. థ్రిల్లర్ చిత్రంలోని ఓ సీన్‌లో ‘బాస్ ఎప్పుడూ కరెక్టే' అని అప్సర చెబుతుందని వర్మ తెలిపాడు.

    English summary
    RGV Apsara Rani THRILLER Shooting Started, The Boss Is Always Right says apsara_rani_ in a moment from her upcoming film THRILLER shreyaset
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X