‘బ్యూటీఫుల్’గా న్యూ ఇయర్.. ఫోటోలతోనే రచ్చ
టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ టు రంగీలా. నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా మలిచిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు సూరి, నైనా అభినయం హత్తుకుంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సన్నివేశాలతో పాటు పాటలు మదిని దోచుకుంటాయని తెలిపింది. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే.

వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ బాలీవుడ్, ఇంకా ఇతర బాషల చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఈ చిత్రంలో రొమాంటిక్‌గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుందని అన్నారు. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. పోస్టర్స్‌తోనే ఇంత వేడిని పుట్టిస్తోన్న బ్యూటీఫుల్.. పూర్తి సినిమాతో ఇంకెన్ని సెగలు పుట్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











