రాజమౌళి ఇంటిపని చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు.. ఛాలెంజ్‌లపై అర్జీవి సెటైర్స్

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కరోనా లాక్ డౌన్ సమయంలో రోజు ఏదో ఒక కామెంట్ చేసి హాట్ టాపిక్ అయ్యేలా చేసే అర్జీవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ యొక్క ఛాలెంజ్‌లపై కూడా తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. రాజమౌళి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు.

కరోనాకు నేను బయపడను..

కరోనాకు నేను బయపడను..

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ కరోనాపై అనేక రకాల కామెంట్స్ చేశారు. ఇప్పటికే దానిపై ఒక పాటను రిలీజ్ చేసిన అర్జీవి త్వరలో సినిమా కూడా చేస్తానని అన్నారు. అయితే కరోనా వల్ల తనలో వచ్చిన మార్పు ఏమి లేదని కానీ బయటకు వెళ్లడం లేదని అన్నారు. అయితే కరోనాకు నేను ఎంత మాత్రం బయపడను అని చెబుతూ మిగతా స్టార్స్ ఖాళీ సమయంలో చేస్తున్న పనుల గురించి కామెంట్ చేశారు.

డైరెక్ట్ కామెంట్స్..

డైరెక్ట్ కామెంట్స్..

ఈ లాక్ డౌన్ లో చాలా మంది నటీనటులు టెక్నీషియన్స్ సరికొత్తగా ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇంట్లో పనులు చేస్తున్నారు. వారిపై మీ కామెంట్ ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అర్జీవి.. అది జనాలు కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారని అన్నారు. అదే విధంగా స్టార్స్ కేవలం ఎట్రాక్షన్ కోసమే ఇలా చేస్తారని, అయితే అందులో మరికొందరు ఫేక్ అని నేను చెప్పలేను అని అన్నారు.

రాజమౌళి చేసింది కూడా అంతే..

రాజమౌళి చేసింది కూడా అంతే..

ఫొటోఅప్ కోసమే చాలా మంది ఈ విధంగా ఛాలెంజ్‌లో భాగంగా హడావుడి చేస్తారని చెప్పిన అర్జీవి దర్శకుడు రాజమౌళి కూడా అదే తరహాలో చేశారని అన్నారు. ఆయన ఇంటి పనులు చేసి చీపురు పట్టినంత మాత్రాన ఎవరు అలాంటి పనులు చేయరని అన్నారు. అంతే కాకుండా రాజమౌళితో పాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్.. చేసినా అది జస్ట్ ఫొటోఅప్ కోసమే అంటూ అర్జీవి సెటైర్స్ వేశారు.

Recommended Video

KTR Counter To Ram Gopal Varma, Tweets Going Viral
వర్మ నెక్స్ట్ సినిమాలు..

వర్మ నెక్స్ట్ సినిమాలు..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సినిమా చేయనున్నట్లు ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన అర్జీవి ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే బ్రేక్ ఇచ్చాడు. లాక్ డౌన్ తరువాత దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారట. చాలా వరకు అర్జీవి ఎనౌన్స్ చేసిన సినిమాలన్నీ రిలీజ్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఇక ఇటీవల కరోనా పై మూవీ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు నిజంగా పూర్తిచేస్తారా? లేదా? అన్నది రిలీజ్ అయ్యే వరకు సందేహమే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X