ఆర్జీవి D కంపెనీ ఓటీటీ విడుదల.. 4 నిమిషాలు ఫ్రీ.. ఫుల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రియల్ క్రైమ్ కథలను తెరకెక్కించాలి అంటే ఆయన తరువాతే ఎవరైనా. ఇక సత్య సినిమాతో మొదటిసారి అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్ లను ఎంతో రియాలిటీగా ప్రజెంట్ చేసిన వర్మ మళ్ళీ చాలా కాలం తరువాత అదే తరహాలో బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీమ్ జీవితం ఆధారంగా D కంపెనీ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొదట సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన కుదరకపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యారు. అయితే ముందు 4 నిమిషాల సినిమాను ఫ్రీగానే చూపిస్తారట.

దావూద్ ఇబ్రహీమ్ కథ వర్మ వాయిస్ ఓవర్ తో ఉంటుందట. 4 నిమిషాల సీన్స్ ను సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇక ఫుల్ మూవీని మే 15న స్పార్క్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి రావాల్సిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. డీ కంపెనీ విడుదల అనంతరం మరిన్ని సినిమాలను ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారట. గత ఏడాది లాక్ డౌన్ పడగానే అందరికంటే వేగంగా షూటింగ్ పూర్తి చేసి డైరెక్ట్ గా ఓటీటీలో పలు సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











