D COMPANY టీజర్ వైరల్.. ఫాంలోకి వచ్చిన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వర్మ తన సత్తాను చాటుకునేందుకు ముందుకు వస్తున్నట్టున్నాడు. నాటి ఆర్జీవీని మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు అదిరిపోయే సినిమాతో వస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న వర్మ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కథను తెరపైకి తీసుకొచ్చాడు. ముంబైలో ఒకప్పుడు అండర్ వరల్డ్ ఎలా రాజ్యమేలిందో కళ్లకు కట్టినట్టు చూపించేందుకు రెడీ అయ్యాడు.
ఓరచూపుతో కాల్చేస్తోంది.. దివ్యా గణేష్ పిక్స్ వైరల్
'డీ కంపెనీ' వెబ్ సిరీస్ ట్రైలర్ శనివారం విడుదలైంది. ఒక చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో 'డీ కంపెనీ' తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్ స్టర్ సినిమాల అన్నింటికి మదర్ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. అండర్ వరల్డ్‌కు ఇది మహాభారతంలాంటిదని తెలిపాడు. అంతే కాకుంగా ఈ మూవీ ఎలా ఉండబోతోంది..ఏం చెప్పదలుచుకున్నాడో అంతా కూడా టీజర్‌లో మాటలు లేకుండానే చెప్పేశాడు.

1980 కాలంలో ముంబైలో జరిగిన ఘటనల గురించి చెబుతూ.. డీ కంపెనీ.. కంపెనీ అంటూ మామూలు కంపెనీ కాదని చెప్పుకొచ్చాడు. ఇందులో వయలెన్స్ డబ్బు.. భయంతో ఒప్పందాలు.. చనిపోవడమే ఉద్యోగంలోంచి బయటకు వెళ్లడం..అంటూ వర్మ తన స్టైల్లో టీజర్‌ను కట్ చేశాడు. మొత్తంగా టీజర్‌పై సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











