ఎగిరెగిరి తంతోన్న వర్మ హీరోయిన్.. అందాలతో షేక్ చేస్తోన్న లేడీ డ్రాగన్
రామ్ గోపాల్ వర్మ ఏ చిత్రాన్ని తెరకెక్కించిన అందులో తన ప్రత్యేకతను చూపించకమానరు. అది గ్యాంగ్‌స్టర్ సినిమా అయినా, ఫ్యాక్షనిస్ట్ చిత్రమైనా, ప్రేమకథలైనా వర్మ తన మ్యాజిక్ చూపిస్తాడు. అసలే ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాజకీయాలను వేడిక్కించిన వర్మ.. లేడీ డ్రాగన్‌ను దింపి కుర్రకారుకు మతి పోగెట్టేలా చేస్తున్నాడు.

పోస్టర్‌తో అంచనాలు..
బ్రూస్‌లీ, అతని యాక్షన్ చిత్రాలు, ఎంటర్ ది డ్రాగన్ లాంటి ఫేమస్ సినిమాల గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. అలాంటి బ్రూస్‌లీని ఆధారించే ఓ అమ్మాయి కథను, అతని జాడలో నడిచి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకున్న లేడీ డ్రాగన్ కథను వర్మ చెప్పబోతోన్నాడు. దీనికి సంబంధించిన ఒక్క పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశాడు ఆర్జీవీ.

ఇండియాలో మొదటి చిత్రం..
మార్షల్ ఆర్ట్స్‌పై తెరకెక్కుతోన్న మొదటి చిత్రమిదేనని ఆర్జీవీ తెలిపాడు. చైనాలో విపరీతంగా పాపులర్ అయిన మార్షల్ ఆర్ట్స్‌కు మన దేశంలో ఎంతో మంది అభిమానులున్నారు. టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఈ కళలో నైపుణ్యం కూడా ఉంది.
చైనా కంపెనీతో కలిసి..
తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని చైనాకు చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోతోన్నట్లు తెలిపాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా నేడు (నవంబర్ 27) విడుదల చేశాడు.
Recommended Video

యాక్షన్‌తో పాటు.. అందాలపైనా ఫోకస్..
ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ కళను అవపోసన పట్టిన అమ్మాయిగా పూజా భలేకర్ నటించింది. టీజర్‌లో చేసిన యాక్షన్స్‌కు కళ్లుతిరిగిపోతుండగా.. తడి అందాలతో పూజా చూపు తిప్పుకోకుండా చేస్తోంది. కెమెరామెన్ కూడా వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











