దీపావళికి అసలైన బాంబు పేల్చనున్న ఆర్జీవీ
ఆర్జీవీ అంటే వివాదలను పక్కన వేసుకుని పడుకునేవాడు. ఏ పని చేసినా.. పది మంది చూసేట్టుగా, చూడాలని చేస్తుంటాడ రామ్ గోపాల్ వర్మ. తీసే ప్రతీ సినిమాలో, పెట్టే ప్రతీ టైటిల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేట్టుగా చూసుకుంటాడు. టైటిల్‌తోనే ఆకర్షించేందుకు ప్రయత్నించే ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో సంచలనాన్ని వదలనున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ వర్మ తన స్టైల్లో తెరకెక్కించిన సినిమా మంచి విజయాన్ని సాధించగా.. అదే ఊపులో మరో చిత్రాన్ని ప్రకటించేశాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ రాజకీయాల్లో సంచలనం రేపే దిశగా ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నాడు. కేసీఆర్ బయోపిక్ ఆధారంగా కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పి.. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దీపావళి కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా ఆర్జీవీ ప్రకటించాడు. ఈ పోస్ట్‌లో వర్మ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాంట్రవర్సీ అయిన పాత్రల ఆధారంగా తెరకెక్కుతోన్న నాన్ కాంట్రవర్సల్ సినిమా.. అంటూ అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించాడు. మరి అదెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











