twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేర్ని నానితో RGV మీటింగ్.. నేను వచ్చింది ఇండస్ట్రీ తరపున కాదంటూ వర్మ న్యూ ట్విస్ట్!

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని మరొకసారి నిరూపిస్తున్నాడు. ఆయన మంచి కోసం పోరాటంలో కూడా కాస్త విభిన్నంగానే ఉంటారనేది అర్థమవుతుంది. ఇండస్ట్రీ లో ఎవరైనా సరే స్వార్థంగా ఆలోచిస్తారని చాలా ఓపెన్ గా చెప్పుకునే వర్మ మంత్రి పేర్ని నానితో చర్చకు వెళ్లిన విషయం తెలిసిందే.. మొన్నటి వరకు ట్విట్టర్ లో మంత్రికి ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చిన వర్మ ఇప్పుడు ప్రత్యేకమైన మీటింగ్ లో ఏ విధంగా మాట్లాడుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

    Recommended Video

    RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
    నేతలకు వర్మ కౌంటర్

    నేతలకు వర్మ కౌంటర్

    దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా అది జనాల్లోకి వెళ్లే విధంగా చాలా ఈజీగా ప్రమోషన్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల రేట్ల విషయంపై మొదటిసారి స్పందించిన విధానం ఎంతగానో ఆలోచింపజేసింది. ఒక విధంగా ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చాడు అనే చెప్పాలి.

    పేర్ని నానితో డైరెక్ట్ మీటింగ్

    పేర్ని నానితో డైరెక్ట్ మీటింగ్

    మంత్రి పేర్ని నానితో ట్విట్టర్ ద్వారా ఇటీవల అనేక రకాల సందేహాలను చాలా పవర్ఫుల్ గా అడిగిన విషయం తెలిసిందే.. అయితే కలిసి చర్చలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలి అని వర్మ అడగడంతో అందుకు పేర్ని నాని కూడా ఒప్పుకున్నాడు. ఈ విషయంపై రాంగోపాల్ వర్మ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    సచివాలయంలో భేటి..

    సచివాలయంలో భేటి..

    సోమవారం మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రామ్ గోపాల్ వర్మ నానితో భేటీ అయ్యారు. ఇక అంత కంటే ముందే వర్మ మీడియా ముందుకు వచ్చే ఎవరూ ఊహించని విధంగా తన వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం వర్మ ఇండస్ట్రీ తరఫున మాట్లాడేందుకు వెళుతున్నాడు అని అందరూ అనుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం ఆయన తన లాజిక్ ను ఫాలో అవుతున్నాడు.

    అందుకే వచ్చాను..

    అందుకే వచ్చాను..

    రాంగోపాల్ వర్మ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక వర్మ మీడియాతో మాట్లాడుతూ.. గవ్నమెంట్ చెప్పే దానికి అలాగే మేం మాట్లాడేదానికి కూడా చిన్న చిన్న మిస్ అడర్ స్టాండింగ్స్ ఉన్నాయని అయితే వాటిని మీటింగ్ ద్వారా మాట్లాకోవడానికి మాత్రమే వచ్చానని అంతకుమించి మరొకటి లేదని అన్నారు.

    నేనేమి చెప్పలేను..

    నేనేమి చెప్పలేను..

    ఇక తాను ప్రభుత్వాన్ని కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదని అంటూ కేవలం నేను చెప్పిన వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా? అంటే ఆ విషయంలో కూడా తానేమీ చెప్పలేనని అన్నారు. మొత్తంగా తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని.. నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్‌ గా అలాగే దర్శకుడిగా నా వ్యూ పాయింట్ చెప్పడానికి మాత్రమే వచ్చానట్లు ఆర్జీవి వివరణ ఇచ్చారు.

    ఇండస్ట్రీ తరుపున కాదని ..

    ఇండస్ట్రీ తరుపున కాదని ..

    ఇక ఇండస్ట్రీ పెద్దల విషయంలో కూడా నేను మాట్లాడాలనుకోవడం లేదని, నేను వచ్చింది ఇండస్ట్రీ తరుపున కాదని కూడా వర్మ మరో ఊహించని కామెంట్ చేశారు. కేవలం నా తరుపున మాత్రమే వచ్చాను అంటూ.. ఫిల్మ్ మేకర్‌గా మాత్రమే వచ్చానని అన్నారు. ఇక నాగార్జున ఇటీవల చేసిన కామెంట్‌లపై నేను స్పందించాల్సిన అవసరం లేదని, నాలాగే అందరికీ నోరు ఉంటుంది కాబట్టి వాళ్ల నోరు గురించి నేను మాట్లాడను..అంటూ వర్మ తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.

    English summary
    Rgv meeting with perni nani before media interaction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X