దిశ ఘటనపై సినిమా.. చెన్నకేశవులు భార్యను కలిసిన ఆర్జీవీ
దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటనగా నిలిచి పోయే నిర్భయ ఘటన, దిశ ఘటనలు సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే దిశ ఘటనకు సత్వర న్యాయం జరిగిందని సమాజం భావిస్తుండగా.. నిర్భయ దోషులు మాత్రం ఇంకా జీవిస్తూనే ఉన్నారని అందరూ మండిపడుతున్నారు. అయితే దిశ ఘటనపై ఆర్జీవీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దిశ ఘటన ఆధారంగా ఓ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు.

ఎన్‌కౌంటర్ అంటూ డిమాండ్..
దిశ హత్యాచార ఘటన తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా సభ్య సమాజం మొత్తం గొంతెత్తింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాభీష్టం, డిమాండ్ మేరకు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో ప్రకటన..
దిశ ఘటన జరిగిన స్థలం, అప్పటి విషయాలను ట్వీట్ చేస్తూ తాను ఓ సినిమా తీయబోతోన్నట్టు ప్రకటించాడు. అయితే ఇలాంటివెన్నో ప్రకటించారు కానీ పట్టాలెక్కవు అని చాలా మంది అనుకున్నారు. కానీ నేడు మరో షాక్ ఇచ్చాడు ఆర్జీవీ. దిశ ఘటనకు కారణమైన చెన్నకేశవుల భార్యను కలిశాడు ఆర్జీవీ.

పదహారేళ్లకే పెళ్లి..
అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు. దీనిపై ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశానని పేర్కొన్నాడు. చెన్నకేశవులుని 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని తెలిపాడు.

పదిహేడేళ్లకే బిడ్డకు జన్మ..
ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందంటూ ట్వీట్ చేశాడు. దిశతో పాటు రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు..వాడు చేసిన వెదవ పనికి.. ఇప్పుడు భార్యతో పాటు... పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నాడు.


Click it and Unblock the Notifications











