దిశా ఘటనపై ఆర్జీవి మూవీ.. టీజర్ డేట్ ఫిక్స్, సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్యాప్ లేకుండా వరుసగా ఎదో ఒక సినిమాను ఎనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ వాటి విడుదల మాత్రం మిస్టరీగానే మారుతోంది. లాల్ డౌన్ లోనే దాదాపు ఒక పధికి పైగా సినిమాలను రెడీ చేయడానికి ప్లాన్ చేసిన వర్మ అందులో కొన్ని షూటింగ్స్ పూర్తయినా కూడా రిలీజ్ చేయలేదు. తన ATT ఆర్జీవి వరల్డ్ లో ఎక్కువ లాభాలు అందకపోవడం వల్లే వర్మ కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నిజమైన సంఘటనలపై సినిమాలు తీయడంలో నిష్ణాతుడైన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రకటనతో ముందుకు వచ్చాడు. దిశా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఒక సినిమాను ప్రకటించిన వర్మ ఆ సినిమా టీజర్ పై మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చాడు. గత ఏడాది హైదరాబాద్ నగరాన్ని కదిలించిన దిశా అత్యాచారం సంఘటనను ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇక ఆర్జీవీ దిశా చిత్రం గురించి చాలా రోజుల తరువాత స్పందించాడు.

"దిషా ఎన్‌కౌంటర్, 2019 నవంబర్ 26 హైదరాబాద్‌లో ఒక యువతిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం, హత్య ఘటన ఆధారంగా నిర్మించినది. ఈ చిత్రం 2020 నవంబర్ 26, విడుదల అవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత ఘోరమైన నేరం అంటూ రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్రాన్ని విడుదల చేస్తూ టీజర్ ని సెప్టెంబర్ 26న ఉదయం 9గంటల 08నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోతే యధావిధిగా వర్మ తన ఆర్జీవి వరల్డ్ లోనే విడుదల చేసే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











