మర్డర్ సాంగ్ పాడి షాక్ ఇచ్చిన వర్మ.. ఆయన గొంతుకు శృతిలయలు అవసరం లేదు!

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనమే. రానున్న రోజుల్లో వర్మ అంటే అంతకు మించి అనేలా క్రేజ్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒక్క దర్శకుడిగానే కాకుండా వర్మ మంచి సంగీత ప్రియుడు అని అందరికి తెలిసిన విషయమే. అందుకే అప్పుడప్పుడు తన గాత్రంతో ప్రేక్షకులకు ఊహించని కిక్కు అందిస్తుంటారు. ఇక మరోసారి మర్డర్ సినిమా కోసం ప్రేమించడం తప్పా అనే పాటను పాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేశారు.

 కొంచెం కూడా తగ్గడం లేదు.

కొంచెం కూడా తగ్గడం లేదు.

లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి ఓటీటీ సినిమాలతో దుమ్ముదులుపుతున్న వర్మ ప్రమోషన్స్ విషయంలో మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. మిర్యాల గూడా పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న మర్డర్ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన వర్మ ఇప్పుడు సాంగ్స్ తో కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. ప్రేమించడం తప్పా అనే పాటను ఇటీవల రిలీజ్ చేశారు.

పిల్లల్ని ప్రేమించడం తప్పా...?

పిల్లల్ని ప్రేమించడం తప్పా...?

పిల్లల్ని ప్రేమించడం తప్పా...? అంటూ సాగే 'మర్డర్' (కుటుంబ కథా చిత్రం) చిత్రం పాటను సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఆ మధ్య జరిగిన ఒక సంచలన యదార్ధ ప్రేమ హత్య ఉదంతాన్ని ఆధారం చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పాటలో వర్మ తన సరికొత్త గాత్రాన్ని అందించాడు.

పాటకు ఊహించని ఏండింగ్

పాటకు ఊహించని ఏండింగ్

చిన్నప్పుడు కూతురి మంచి కోసం కొట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ.. అప్పుడు ఏమనని ప్రపంచం ఇప్పుడు జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నిస్తే తప్పని అంటారా? అనే విధంగా వర్మ తన గాత్రం ద్వారా తెలియజేశారు. చివరకు చంపడం తప్పా అనే వరకు కూడా ఆర్జీవి తనదైన శైలిలో పాటకు ఊహించని ఏండింగ్ ని ఇచ్చారు.

శృతి లయలు అవసరం లేదని..

ఇక సాంగ్ విన్న అభిమానులు వర్మ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. ఆయన పాటకు శృతి లయలు అవసరం లేదని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వర్మ ఊహించని షాక్ ఇచ్చాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేస్తామని నిర్మాత నట్టి క్రాంతి తెలిపారు.

Recommended Video

Poonum Kaur Fires On Police About Priyank Reddy Murder
ట్రైలర్ కి భారీ రెస్పాన్స్

ట్రైలర్ కి భారీ రెస్పాన్స్

ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తొలి ట్రైలర్ గత మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ కి దాదాపు 70 లక్షల మంది చూశారని, ఒక ఫ్యామిలీ చిత్రంలా ఎంతో బావుందన్న ప్రశంసలు ప్రేక్షకుల నుంచి లభించాయని నిర్మాత వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X