ప్యాన్ ఇండియాగా ఆర్జీవీ ‘Murder’.. ట్రైలర్ ఎప్పుడంటే?
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఓ సెన్సేషనే. అది మియా మాల్కోవాతో తీసిన చిత్రమే కానివ్వండి, శ్రీరాపాక అంటూ కొత్త అందంతో ప్రయోగం చేసినా, పవర్ స్టార్ అంటూ సెటైరికల్ మూవీ తీసినా వర్మ ముద్ర తప్పక కనిపిస్తూ ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన మిర్యాల గూడ ఘటన, పరువు హత్య, అమృతప్రణయ్‌ల కథ ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని వర్మ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్లే నానా రచ్చను సృష్టించాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈ లాక్ డౌన్ కాలంలో వర్మ అంత బిజీగా మరోకరు ఉండి ఉండరు. లాక్డౌన్ సమయంలోనే కరోనా మీద సినిమా, క్లైమాక్స్, నగ్నం అంటూ వేడి పుట్టించే సినిమాలు రెడీ చేశాడు. ఇక పవర్ స్టార్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఆ చిత్రం తరువాత మర్డర్‌తో రచ్చ చేయాలని భావిస్తోన్నట్టు కనిపిస్తోంది.

అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోన్నట్టు తెలుస్తోంది. మర్దర్ చిత్రానికి సంబంధించిన ఓ తాజా అప్ డేట్‌ను వర్మ ప్రకటించాడు. ఈ కథ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది కాబట్టి.. మర్డర్ ట్రైలర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టు తెలిపాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. జూలై 28న ఉదయం 09 గంటల 08 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు పేర్కొన్నాడు. మరి ఈ ట్రైలర్‌తో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











