'D కంపెనీ' వీడియో.. మరోసారి వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవి
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వెబ్ కంటెంట్ వైవు ఎక్కువగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కాంట్రవర్సీని మరువకుండా అలాగే తనదైన మేకింగ్ స్టైల్ తో విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాడు. గతంలో ఎన్నో రకాల సినిమాలను చేసిన వర్మ ఈసారి ఒక రియల్ అండర్ వరల్డ్ కథను సెలెక్ట్ చేసుకున్నాడు. దావూద్ ఇబ్రహీమ్ జీవిత ఆధారంగా D కంపెని అనే సినిమాను రూపొందించాడు.
ఈ సినిమాను మొదట థియేటర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఎప్పటిలానే ఓటీటీ ఫార్మాట్ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆ సినిమాపై ఓ వర్గం అడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు వర్మ నాలుగు నిమిషాల ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేసిన మరింత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇక 4 నిమిషాల వీడియోకు వర్మ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. '' ముంబై ఇప్పుడు ప్రశాంతగా ఉంది. కానీ 40 ఏళ్ల క్రితం డి-కంపెనీ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు. దావూద్ ఇబ్రహీం ని చాలా స్టడీ చేశాను. నేను క్రిమినల్ ని కాదు. కానీ చిన్నప్పటి నుంచి క్రిమినల్స్ ని స్టడీ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో గ్యాంగ్ స్టర్స్ అందరూ దావుద్ లాగా ముంబైకి కింగ్ అవ్వాలని కలలు కన్నారు. కానీ ఇప్పుడు దావూద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఫెమస్ అయింది.. డీ కంపెనీ 1980లో ఒక అర్థరాత్రి సోనియా బార్ లో.." అంటూ ఆర్జీవీ వాయిస్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. ఇక ఫుల్ మూవీని మే 15న స్పార్క్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు


Click it and Unblock the Notifications











