‘Murder’ కుటుంబ కథా చిత్రమ్.. అమృత-ప్రణయ్‌లపై సినిమా.. మరో సంచలనానికి తెరదీసిన వర్మ!!

రామ్ గోపాల్ వర్మ ఒక్కోసారి ఏది చేసినా సెన్సేషన్ అవుతంది. మరి కొన్ని సార్లు సంచలనం సృష్టించిన విషయాలపై ఫోకస్ పెట్టి మరింత అటెన్షన్ రాబట్టుకుంటాడు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశాన్ని సైతం షేక్ చేసింది మిర్యాల గూడ ఘటన. ప్రణయ్ హత్య కేసు, అమృత ప్రేమ, మారుతీ రావుకు కూతురిపై గల ప్రేమ అన్నీ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మిర్యాట గూడలో అత్యంత కిరాతకంగా తన అల్లుడినే చంపించాడు మారుతీ రావు. ఇక ఈ విషయంపై సమాజంలో భిన్న రకాల వాదనలు వినిపించాయి. అంతగా కుదిపేసిన ఈ అంశంపై వర్మ సినిమాను తీసేందుకు రెడీ అయ్యాడు.

Recommended Video

Amrutha Pranay's Movie మర్డర్ by RGV | ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటున్న Amrutha
పరువు హత్య..

పరువు హత్య..

అమృత ప్రణయ్‌ల ప్రేమను ఒప్పుకోకపోవడం, తండ్రిని ఎదురించి పెళ్లి అమృత పెళ్లి చేసుకోవడం, ఆఖరికి ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి చంపిచడం అన్నీ కూడా అందర్నీ నివ్వెరబోయేలా చేశాయి. అత్యంత కిరాతకంగా ప్రణయ్‌ను చంపిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.

తనువు చాలించిన మారుతీరావు..

తనువు చాలించిన మారుతీరావు..

ప్రణయ్ హత్య ఘటనలో మారుతీ రావును కూడా ఓ వర్గం సమర్ధించింది. బాధ్యతలను విస్మరించి ప్రేమ, పెళ్లి అని తిరగడం ఏంటని అమృతను టార్గెట్ చేసిన వారు కూడా ఉన్నారు. చివరకు కొన్ని నెలలు జైల్లో గడిపిన మారుతీరావు బెయిల్ బయటకు వచ్చి.. ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్జీవీ సినిమా..

ఆర్జీవీ సినిమా..

నేటి ఫాదర్స్ డేను పురస్కరించుకు వర్మ చేసిన ప్రకటన అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. ‘అమృత, ఆమెను ఎంతో ప్రేమించిన మారుతీ రావుల విషాద కథను ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఫాదర్స్ డే సందర్భంగా నేటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నా'నని తెలిపాడు.

అమితమైన ప్రేమ..

అమితమైన ప్రేమ..

మరో ట్వీట్ చేస్తూ.. ‘తండ్రికి ఉండే విపరీతమైన ప్రేమ.. అమృత-మారుతి రావుల జీవితంలో జరిగినట్టుగా భయంకరమైన విషాదానికి కారణం అవుతుంది. ఎవ్వరూ కూడా అలాంటి చెడ్డ తండ్రికి విషెస్ చెప్పరు.. చెడ్డ ఫాదర్స్ డే ఫస్ట్ లుక్ నేటి సాయంత్రం ఐదు గంటలకు' అని ఉత్సుకతను పెంచాడు.

మారుతీ రావు పాత్రే హైలెట్..

మారుతీ రావు పాత్రే హైలెట్..

‘ఓ కూతరిని అమితంగా ప్రేమించిన డేంజర్ ఫాదర్ అమృత-మారుతీ రావు కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. ఇది మీ గుండెను తడి చేస్తుంది.. హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా చెడ్డ ఫాదర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్' అంటూ టైటిల్, ఫస్ట్ లుక్‌ను వర్మ రిలీజ్ చేశాడు. ఈ లెక్కన ఈ చిత్రంలో మారుతీ రావు పాత్రే హైలెట్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X