Just In
- 6 hrs ago
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
- 7 hrs ago
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- 8 hrs ago
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
- 8 hrs ago
అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Technology
బెటర్ సెక్యూరిటీతో క్వాల్కామ్ 3డి సోనిక్ మ్యాక్స్
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శివ స్ఫూర్తితో.. హైదరాబాద్ దాదాలపై సినిమా.. మరో బాంబ్ పేల్చిన ఆర్జీవీ
ఆర్జీవీ సినిమాలంటే వివాదాలు ఉండాల్సిందే. వివాదాలు సృష్టించడానికే తెరకెక్కిస్తాడేమో అనేట్టుగా కొన్ని చిత్రాలను తీస్తూ ఉంటాడు. టైటిల్ దగ్గరి నుండి మొదలయ్యే ఈ వివాదాలు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంటాయి. అదే ఆర్జీవీ స్ట్రాటజీ అని అందరూ అనుకుంటారు. మూవీస్‌ను ప్రమోట్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా. తోచినన్ని సినిమాలను ప్రకటిస్తాడు.. అందులో ఎన్ని తెరకెక్కుతాయో.. ఎన్ని అటకెక్కుతాయో ఎవ్వరికీ తెలీదు. అయితే తాజాగా మరోసారి ఓ వింత టైటిల్‌ను ఎత్తుకున్నాడు. ఈ సారి హైదరాబాద్ నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించి మరో బాంబ్ వేశాడు.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు పెట్టిన చిచ్చు..
ఏపీ రాజకీయాలను హైలెట్ చేస్తూ.. వర్మ తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టైటిల్‌తో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఎన్నో కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి.. ఈ మూవీపై రాజకీయ వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి. ఇంతలా వేడి పుట్టిస్తోన్న ఈ మూవీ సంచలనంగా మారుతోంది. దీపావళి కానుకగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా ట్రెండ్ అయింది. పాత్రల తీరే కాదు.. రియల్ క్యారెక్టర్స్‌ను పోలి ఉండటంతో మరింత రిలేట్ చేసుకుంటున్నారు జనాలు. దీంతో వర్మ అనుకున్నట్లే.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అది కూడా సరిపోదన్నట్లు మరింత అగ్గిని రాజేయాలనుకున్నట్లు తెలుస్తోంది.

పాటలతో హల్‌చల్..
ఈ మూవీలో కేఏ పాల్, లోకేష్, చంద్రబాబులను పరోక్షంగా టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలసిందే. కేఏ పాల్ సాంగ్ విపరీతమైన నవ్వును తెప్పిస్తుండగా.. లోకేష్‌పై చిత్రీకరించిన పప్పులాంటి అబ్బాయి పాట ఎంత ఫేమస్ అయిందో అందరం చూశాం. ఇలా పాటలతోనే ఇంతటి సెన్సేషన్ సృష్టింస్తోన్న ఆర్జీవీ ఈ మూవీతో ఇంకెందరి మధ్యలో చిచ్చు పెడతాడో చూడాలి.
|
జార్జి రెడ్డితో రానున్న హీరో..
వంగవీటి సినిమాతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న సందీప్ మాధవ్.. ప్రస్తుతం జార్జి రెడ్డి చిత్రంతో రాబోతోన్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉండటంతో, సందీప్ మాధవ్‌తో మరో సినిమాను తీయబోతోన్నట్లు ఆర్జీవీ ఓ బాంబ్‌ను పేల్చాడు.

హైదరాబాద్ దాదాల ఆధారంగా..
విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారని... ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నానని తెలిపాడు. 1980లలో హైదరాబాదులో నెలకొన్న దాదాగిరి, దాదాలపై ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కబోతోందని... ఈ చిత్రానికి 'శివ' సినిమానే స్ఫూర్తి అని తెలిపాడు. 'హైదరాబాద్ దాదాలు' చిత్రంలో 'జార్జిరెడ్డి' ఫేం సందీప్ మాధవ్ ప్రధాన పాత్రను పోషిస్తాడని చెప్పాడు.