RGV దెయ్యం.. ట్రైలర్ తోనే షాక్ ఇచ్చిన వర్మ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా ముందుగా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆర్జీవి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు హారర్ సినిమాలతో కూడా సరికొత్త థ్రిల్ ఇస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు దెయ్యం అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ దర్శకుడి నుంచి హారర్ మూవీ వచ్చి చాలా కాలమయ్యింది. ఇంతకుముందు 'కౌన్', 'భూత్', 'ఫూంక్' వంటి సినిమాలతో భయంతో కిక్కిచ్చిన విషయం తెలిసిందే.
ఇక దెయ్యం సినిమా అప్పట్లో ఒక రేంజ్ లో షాక్ ఇచ్చింది. ఆ సినిమాకు భయపడి కొందరు సినిమాకు కూడా వెళ్లలేదట. అంటే హారర్ డోస్ ఏ రేంజ్ లో ఇచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ 'Rgv దెయ్యం' అనే మరో కొత్త దెయ్యం కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించారు. అలాగే స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు.

సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతి దీక్షిత్ ఒక దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చాలా పవర్ఫుల్ గా చూపించారు. ఇక రాజశేఖర్ ఒక తండ్రి పాత్రలో ఎలాంటి మేకప్ టచ్ వాడకుండా నటించారు. ట్రైలర్ అయితే ఓ వర్గ. ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమాను ఈ నెల 16 న 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవి క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











