తన ఆస్తులపై మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన RGV... మనవరాలిపై స్పందిస్తూ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనమే అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఎప్పుడూ ఓకే తరహా ఆలోచనలతో ఉండే వర్మ అంటే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన లాజిక్స్ కు నేటి యువత బాగా కనెక్ట్ అవుతుంది. అంతగా మంచి క్రేజ్ అందుకున్న వర్మ ఆస్తులు, ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఇక ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాలపై అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు

ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు

రామ్ గోపాల్ వర్మ శివ సినిమా నుంచి తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్, హారర్, బయోపిక్స్ అంటూ ఎన్నో విభిన్నమైన కథలను టచ్ చేశాడు. తెలుగులో కంప్లీట్ హారర్ చిత్రాలని ప్రవేశపెట్టిన మొదటి దర్శకుడు వర్మ అని చెప్పవచ్చు. అప్పట్లో దెయ్యం సినిమాను అతి తక్కువ బడ్జెట్ లో తీసి హారర్ థ్రిల్ ను చూపించారు.

ఇంటర్వ్యూలతో బిజీబిజీగా

ఇంటర్వ్యూలతో బిజీబిజీగా

ఎన్నో ట్రెండ్ సెట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వర్మ పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా చాలా ఓపెన్ గానే క్లారిటీ ఇస్తుంటారు. ఎవరు అడిగినా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బహుశా RGV రేంజ్ లో ఎవరు కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదేమో అనిపిస్తుంది.

ఆస్తులు ఎంత ఉన్నాయి?

ఆస్తులు ఎంత ఉన్నాయి?

ఇక తన ఆస్తులపై కుటుంబ సభ్యులపై పెద్దగా వివరణ ఇవ్వని వర్మ మొదటిసారి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ఇప్పటివరకు వర్మ ఎన్నో సినిమాలు చేశాడు. అలాగే నిర్మించారు కూడా. అలాంటి వర్మకు ఆస్తులు ఎంత ఉన్నాయి అని యాంకర్ అడుగగా.. అలాంటివి చెప్పాను అంటూ తాను చనిపోతే ఆస్తి కూడా నాతో పాటు తీసుకుపోతాను అంటూ కామెడీగా కౌంటర్ ఇచ్చారు. వారసులు ఎవరు లేరని కూడా అన్నాడు.

మనవరాలిపై స్పందిస్తూ...

మనవరాలిపై స్పందిస్తూ...

ఏదేమైనా ఆ విషయాల గురించి పెద్దగా ఆలోచించనని చెప్పిన రామ్ గోపాల్ వర్మ తన కూతురు గురించి కూడా చెప్పాడు. తనకు బంధాలు అంటే అస్సలు సెట్టవ్వవని అంటూ తన కూతురుకు పుట్టిన పాప కూడా గుర్తు లేదని చెప్పాడు. మనవరాలి పేరు కూడా తెలియదని, నా కూతురు నన్ను నాన్నలా కాకుండా ఒక ఫ్రెండ్ లా చూస్తుందని అన్నాడు. ఇక ఆర్జీవి కూతురి పేరు రేవతి వర్మ. ఆమె అలా డాక్టర్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం యూఎల్స్ లో ఉంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X