సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం.. RGV పరన్నాజీవి ఫస్ట్ లుక్ వైరల్!
విలక్షణ దర్శకుడు ఆర్జీవి ఓటీటీ వరల్డ్ లో సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కాంట్రవర్సీల డోస్ మరింతగా పెంచుకుంటూ వెళుతున్నాడు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ సినిమా తీస్తూ అభిమానులకు పట్టారని కోపం తెప్పిస్తున్నాడు. ఇక మొత్తానికి తన పేరుపై కూడా సినిమా వచ్చే వరకు తెచ్చుకున్నాడు అంటే ఏ రేంజ్ లో రెచ్చగొడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video

షాక్ ఇచ్చేలా పరాన్న జీవి
నూతన్ నాయుడు దర్శకత్వంలో RGVపై పరాన్న జీవి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రెక్లెస్ జెనెటిక్ వైరస్ అంటూ RGVకి గట్టి కౌంటర్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతొంది. మునుపెన్నడు లేని విధంగా ఆర్జీవికి షాక్ ఇచ్చేలా ఈ సినిమా రూపొందనుందట. ఇక ఈ రోజు రాత్రి 8.20నిమిషాలకు ఆర్జీవికి కౌంటర్ ఇచ్చేలా ఆషాడ అమావాస్య స్పెషల్ లో భాగంగా ఈ సాంగ్ న్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.

సినిమా చూపిస్తాం..
అదే విధంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ వర్మకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాది దాడి కాదు. ప్రతి దాడి. వ్యూహం కాదు..ప్రతి వ్యూహం. బకారాలతో ఆడుకుంటే నీకు బిర్యానీ దొరకచ్చు. సింహంతో పెట్టుకున్నావ్ సినిమా చూపిస్తాం... అంటూ సినిమాకు సంబంధించిన ఒక డిఫరెంట్ లుక్ ని రిలీజ్ చేశారు.

పరాన్న జీవి vs RGV
ఇక 25వ తేదీన పరాన్న జీవి ఉదయం 11గంటలకు శ్రేయస్ et లో విడుదల కానున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచుతుంటే పవన్ ఫ్యాన్స్ కూడా పరాన్న జీవి పోస్టర్స్ ని వైరల్ చేయాడానికి కృషి చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఆర్జీవిని ఎలా చూపించబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

చర్యకు ప్రతిచర్య..
చర్యకు ప్రతి చర్య ఉంటుందని కచ్చితంగా చెబుతున్నారు గాని ఆర్జీవి రేంజ్ లో నూతన్ నాయుడు సెన్సేషన్ క్రియేట్ చేయగలడా అనేది పెద్ద సందేహం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వర్మ ఏ మాత్రం తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. పైగా ఫ్యాన్స్ ఎంత రియాక్ట్ అయితే అంత ప్రమోషన్స్ అన్నట్లుగా వారిని గట్టిగానే రెచ్చగొడుతున్నాడు. మరి ఈ రేండు సినిమాల్లో ఏది ఎక్కువగా సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











