‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో రిలీజ్ ఆలస్యంపై... ప్రజలు ఏమంటున్నారంటే?

Recommended Video

'People In AP Are Very Angry Due To The Delay Of Lakshmi's NTR Release' Says RGV || Filmibeat

రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడిని విలన్‌గా చూపించారని, ఇది ఏపీ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ పలువురు కేసులు వేయడంతో వివాదం కోర్టుకెక్కింది. అయితే ఆ వివాదం ఎటూ తేలక పోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ ఆగిపోయింది. అయితే తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‍‌లో ఈ చిత్రం విడుదలైంది. సినిమా ఇక్కడ విడుదల ఆలస్యం కావడంపై ట్విట్టర్ పోల్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ.

ప్రజలు కోపంతో, బాధతో ఉన్నారా?

ప్రజలు కోపంతో, బాధతో ఉన్నారా?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల ఆలస్యం కావడం వల్ల ప్రజలు కోపంగా, బాధగా ఉన్నారా? అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా పోల్ సర్వే నిర్వహించారు. ఈ పోల్ పోస్ట్ చేసిన 5 గంటల్లోనే దాదాపు 21వేల మంది ఓట్ వేశారు. ఇందులో 75శాతం మంది... సినిమా రిలీజ్ ఆలస్యం కావడం వల్ల కోపంగా, బాధగా ఉంది అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 25 శాతం మంది మాత్రం అలాంటి దేమీ లేదని తెలిపారు.

ఇతర ప్రాంతాలకు వెళ్లి చూస్తున్న ఫ్యాన్స్

ఇతర ప్రాంతాలకు వెళ్లి చూస్తున్న ఫ్యాన్స్

ఏపీలో ఈ చిత్రం విడుదల కాక పోవడంతో... కొందరు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలా తమకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి సినిమా చూసే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారనే టాక్ మెజారిటీ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.

రిలీజ్ ఆగిపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం

రిలీజ్ ఆగిపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం

అన్ని ఏర్పాటు పూర్తయిన తర్వాత సినిమా ఉన్నట్టుండి రిలీజ్ ఆగిపోవడంతో ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ఎన్టీ రామారావు జీవితలోని వెన్నుపోటు పర్వం ప్రధానంగా

ఎన్టీ రామారావు జీవితలోని వెన్నుపోటు పర్వం ప్రధానంగా

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X