తెలంగాణ ఎలక్షన్ ఎఫెక్టేనా? ఆర్జీవి ‘భైరవ గీత’ ఇక్కడ రిలీజవ్వడం లేదు!
రజనీకాంత్ మూవీ 2.0తో పోటీ పడుతూ తన 'భైరవ గీత' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు గతంలో గొప్పగా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ చివరకు డిసెంబర్ 7కు రిలీజ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే 'భైరవ గీత' మరోసారి వాదా పడింది.
కన్నడలో ముందుగా అనుకున్న ప్రకారమే డిసెంబర్ 7న 'భైరవ గీత' విడుదలవుతుండగా తెలుగులో మాత్రం డిసెంబర్ 14న విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సినిమా స్క్రీన్లు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ధనంజయ, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో 'భైరవగీత' చిత్రం తెరకెక్కింంది. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో రూపొందించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు పెంచింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మించారు.


Click it and Unblock the Notifications











