లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో 'వెన్నుపోటు' సాంగ్!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి మధ్య జరిగిన జరిగిన సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో అంత్యంత వివాదంగా మారిన రాజకీయ, కుటుంబ విషయాలని ఈ చిత్రంలో వర్మ చూపించబోతునట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం కోసం తాను జరిగిన వాస్తవాలని తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేశానని వర్మ తెలిపాడు. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి పోటీగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో వివాదం ముదిరేలా కనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నుంచి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో వెన్నుపోటు అంటూ సాగే పాటని రూపొందించారట. డిసెంబర్ 21 న ఆర్జీవీ ఈ పాటని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

RGV to release first single from Lakshmis NTR

కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే నటీనటుల వివరాలని వర్మ ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించడం.. ఆ తరువాత జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించాయి. అలాంటి వివాదభరిత అంశాన్ని వర్మ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X