Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఇద్దరి హాట్ ఫోటోస్ పోస్టు చేసి హీట్ పెంచిన రామ్ గోపాల్ వర్మ!
పబ్లిసిటీ వేషాలు రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా బహుషా ఎవరికీ తెలియవేమో? తాను చేసే సినిమాల కంటే తన కాంట్రవర్సల్ స్టేట్మెంట్స్తో వార్తల్లో ఉండే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన సినిమాల పబ్లిసిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రామ్ గోపాల్ వర్మ సమర్పణలో 'భైరవగీత' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ధనంజయ, ఇర్రా మార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేయాలనుకున్నారు కానీ వీలు పడలేదు. దీంతో వర్మ సరికొత్త ఐడియాకు తెరలేపారు.
ఆ ఇద్దరి హాట్ ఫోటోలు రిలీజ్ చేసిన వర్మ
‘భైరవగీత' దసరా రిలీజ్ వాయిదా పడటంతో ఈ చిత్రం గురించి ప్రేక్షకులు మరిచిపోకుండా ఉండటానికి, ఈ మూవీ గురించి టాక్ లైమ్ లైట్లో ఉండటానికి ధనంజయ, ఇర్రా మార్ ఇంటిమేట్ సీన్లకు సంబంధించిన ఫోటోలను వర్మ విడుదల చేశారు.
టెమ్ట్ చేసే విధంగా ఉన్న ఫోటోస్
వర్మ విడుదల చేసిన ధనంజయ, ఇర్రా మార్ రొమాంటిక్ ఫోటోస్ ప్రేక్షకులను టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ ఫోటోస్ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ సీన్లు ఏ రేంజిలో ఉంటాయో? అని చర్చించుకుంటున్నారు.
రాయలసీమ లవ్ స్టోరీ
రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్ ప్రేమకథ ఈ ‘భైరవగీత'. ఇప్పటికే విడుదలైన భైరవగీత ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. సినిమాపై అటెన్షన్ తగ్గకుండా ఉండటానికి వర్మ తనదైన శైలిలో పబ్లిసిటీ చేస్తున్నారు.
భైరవగీత
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనంజయ్, ఇర్రా మిర్రర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, కథ, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వర్మ/రామ్ వంశీకృష్ణ, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి ఎమ్ఎఫ్ఏ, ఎడిటర్: అన్వర్ అలీ, నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ, దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు, సమర్పణ: రామ్ గోపాల్ వర్మ.