లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్: అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ లాగే.. ఆయన ఇక్కడ బ్రతికే ఉన్నారు!
ఓ వైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తుంటే దానికి పోటీగా వివాదాల వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వస్తున్నాడు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలయింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో కలకలం సృష్టిస్తున్నాడు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ని విడుదుల చేశారు.
టీజర్ లో కేవలం ఎన్టీఆర్ లుక్ ని మాత్రమే రివీల్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటించారో కానీ అచ్చు గుద్దినట్లు అలాగే కనిపిస్తున్నారు. ఒంటరిగాకూర్చుని ఉన్న ఎన్టీఆర్ ఎదో ఆలోచిస్తున్నట్లు దీనంగా ఉన్న లుక్ ని వర్మ ఈ టీజర్ లో చూపించారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.

ఈ టీజర్ కు 6:57 గంటలకు ముహూర్తం ఎందుకు పెట్టాడో వర్మ వివరించాడు. 6,5,7 మూడు సంఖ్యలని కలిపితే 18. 1, 8ని కలిపితే 9. 9 భయంకరమైన సంఖ్య అని ఎన్టీఆర్ తన కలలో చెప్పినట్లు వర్మ తెలిపారు. గత కొన్ని ఈరోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాటలతో సందడి చేస్తున్న వర్మ ఎట్టకేలకు ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేయడం విశేషం. వెన్ను పోటుకు గురి కాబడిన ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో బ్రతికే ఉన్నారు అని వర్మ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











