twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీ కంపెనీలో నెంబర్ 2.. అయినా చోటా రాజన్‌ని చంపేసింది.. ఎందుకు షూట్ చేయలేదో?

    |

    కంటికి కనిపించని కరోనా మనుషులతో పెను యుద్దమే చేస్తోంది. సామాన్యులు మొదలు రాజకీయనేతల దాకా, సినీ సెలబ్రిటీలు మొదలు క్రీడాకారులను ఇలా ఎవరినీ వదలకుండా కవర్ చేస్తోంది. తాజాగా మాఫియా డాన్ చోటా రాజన్ కూడా కరోనాకు బలయ్యాడు. ఇటీవల కరోనా బారినపడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింఛి చికిత్స అందిస్తున్నారు. అక్కడే చికిత్స పొందుతున్న రాజన్ కొద్ది సేపటి క్రితం ప్రాణాలు విడిచాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన చనిపోలేదని ఎయిమ్స్ సంస్థ ప్రకటించింది. నిజానికి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చోటాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఏప్రిల్ 26న ఎయిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి ఎయిమ్స్ లోనే ఆయన చికిత్స పొందుతున్నాడు.

    62 ఏళ్ల చోటా రాజన్ 2015లో ఇండోనేషియాలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన మీద 70కి పైగా కేసులు నమోదయ్యాయి.చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్. ముందుగా దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్నా ఆ అనతరం దావూద్ తో విభేదాల కారణంగా చోటా రాజన్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అండర్ వరల్డ్ లో దావూద్ ను నెంబర్ వన్ అంటే ఈయనను నెంబర్ 2 అనేవాళ్ళు. ఆయన మరణం మీద వర్మ ఆసక్తికరంగా స్పందించారు.

    RGV responds on chota rajan demise

    ఇక ముందు వచ్చిన వార్తల ఆధారంగా కరోనా చోటా రాజన్ ను చంపేసిందన్న ఆయన చోటా డీ కంపెనీకి నెంబర్ 2 అన్నా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. నాకు ఆశ్చర్యంగా ఉండి ఆయన దానిని ఎందుకు షూట్ చేయలేదో ? సీరియస్ గా చెబుతున్నా, ఇప్పుడు దావూద్ ఎలా ఫీల్ అవుతున్నాడో ? అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ఆయన డీ కంపెనీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుండి తోలి నాలుగు నిముషాలు ఒక ట్రైలర్ లా జనాల్లో ఆసక్తి రేకెత్తించడానికి రిలీజ్ చేశాడు.

    English summary
    Chhota Rajan, who had tested positive for Covid-19, had been admitted to the New Delhi-based AIIMS on April 26. some reports says that he dies due to covid. but The All India Institute of Medical Services (AIIMS) on Friday denied the reports of underworld don Rajendra Nikalje alias Chhota Rajan's death. But RGV responds about chota's death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X