గీతూ మోహన్‌దాస్ ముందు ఏ మగాడు సరితూగడు.. టాక్సిక్ డైరెక్టర్‌పై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్
కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కునాల్ శర్మ సౌండ్ ఇంజినీర్‌గా, గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష కొరియోగ్రాఫర్లుగా, జేజే పెర్రీ, అంబరివ్, కెచా కంపాక్‌డీ, అమృత్ సింగ్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2026, మార్చి 19వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే హీరో యష్ బర్త్ డేను పురస్కరించుకొని ఈ సినిమాలో ఆయన నటిస్తున్న రాయా క్యారెక్టర్‌ను అభిమానులకు పరిచయం చేశారు.

అయితే టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్, యాక్షన్ సీన్ల గురించి పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతున్నది. ఓ మహిళా దర్శకురాలు ఇంత ఘాటుగా సినిమాను తెరకెక్కించిందా? అంటూ కొందరైతే ముక్కున వేలేసుకొంటే.. ఓ లేడీ డైరెక్టర్ ఇంత గట్స్‌తో సినిమాను రూపొందించిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ సినిమా గ్లింప్స్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ఆయన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ టేకింగ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత.. గీతూ మోహన్ దాస్‌పై నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఆమె మహిళా చైతన్యానికి నిజమైన చిహ్నం అనిపిస్తున్నది. ఏ మగ డైరెక్టర్ కూడా ఆమెతో పోల్చుకోవడానికి పనికిరాడు. ఈ రేంజ్‌లో సినిమాను తెరకెక్కించిందా? అనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











