RGV's Ammayi Trailer Review: ఊహకు అందని పూజా భలేకర్ పోరాట విన్యాసాలు
పారిజాత మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వం రూపొందిన చిత్రం అమ్మాయి. భారతీయ సినిమా రంగంలో తొలి మార్షల్ ఆర్ట్‌గా రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు భారీ అంచనాలను పెంచుకొన్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడానికి తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ ట్రైలర్ ఎవరూ ఊహించని విధంగా పవర్ ప్యాక్డ్‌గా కనిపించింది. పూజా భలేకర్ ఫైట్స్, డ్యాన్స్‌లు, ఎమోషన్స్, హవభావాలు ఈ ట్రైలర్‌గా హైలెట్‌గా మారాయి.
పుజా భలేకర్ బ్రూస్ లీ పాత్రలో సినిమాలో వన్ ఉమెన్ మ్యాన్ షోగా కనిపించింది. ఊహకు అందని విధంగా పోరాట విన్యాసాలు, ఫ్రంట్ కిక్, సైడ్ కిక్స్‌తో ఇరుగదీసింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా మానవ భావోద్వేగాలకు ఈ సినిమాలో చోటు ఇచ్చినట్టు కనిపించింది. ప్రేమ, మాఫియా అంశాలను కలబోసి అమ్మాయి చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది.

ట్రైలర్ రిలీజ్ తర్వాత అమ్మాయి సినిమాపై యూత్‌ను మరింత ఆకట్టుకోవడం గ్యారెంటీగా కనిపిస్తున్నది. అయితే ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజై వస్తున్నది. ఇండియాతోపాటు చైనాలో కూడా విడుదల కావడం విశేషం. ఇక పూర్తిస్థాయిలో ఈ చిత్రం ఏ విధంగా ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు: పూజా భలేకర్, అభిమన్యు సింగ్ తదితరులు
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాణం: ఇండో చైనీస్ ప్రొడక్షన్ - బిగ్ పీపుల్
మ్యూజిక్: రవి శంకర్, డీఎస్ఆర్
డీవోపీ: మలహర్ భట్ జోషి
ఎడిటర్: కమల్ రామడుగు, ప్రభుదేవా
ఆర్ట్ డైరెక్టర్: మధుకర్ దేవరా
రిలీజ్: 2021-12-10


Click it and Unblock the Notifications











