RGV's Disha Encounter Trailer: దిశ లైంగికదాడి కథతో రాంగోపాల్ వర్మ
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార, హత్య ఘటన ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాతగా మారి దిశ ఎన్‌కౌంటర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆనంద్ చంద్ర. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆర్జీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు.
దిశ అనే అమ్మాయిని నలుగురు లైంగిక దాడి చేసిన ఘటనను తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో కీలక సన్నివేశాలతో చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. సన్నివేశాల చిత్రీకరణ ఆర్జీవి స్థాయిలో కనిపించాయి. ట్రైలర్‌లో రీరికార్డింగ్ సినిమాపై అంచనాలు పెంచింది.

దిశ ఎన్‌కౌంటర్ సినిమాలో టైటిల్ పాత్రను పోషించిన సోనియా ఆకులపై రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. హృదయాన్ని భావోద్వేగానికి గురిచేసే కథలో సోనియా అద్భుతంగా నటించింది. సోనియా ఆసా (యాక్షన్ ఎయిడ్ ఫర్ సోసైటల్ అడ్వాన్స్‌మెంట్) అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలు. ఆమెను ట్విట్టర్ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాను అంటూ వర్మ ట్వీట్ చేశారు.
యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అనురాగ్ ప్రొడక్షన్స్‌పై రూపొందింది. ఈ చితాన్ని కరుణ నట్టి సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 26 తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అనురాగ్ కంచర్ల తెలిపారు.
ఈ చిత్రంతో శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, ప్రవీణ్ రాజ్, నవీన్ బోనం, కళ్యాణ్ వీరమల్ల, ముని మాయదారి తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ కళ్యాణ్ సమీ, ఆర్ట్ డైరెక్టర్ జి.సందీప్ కుమార్, సంగీతం డి. ఎస్. ఆర్., సౌండ్ ఎఫెక్ట్ శేషు కుమార్, పి.ఆర్.ఓ. మధు వి.ఆర్.


Click it and Unblock the Notifications











