RGV's Naked teaser released: NNN మరో ప్రయోగంగా
మియా మాల్కోవాతో రూపొందించిన క్లైమాక్స్ సినిమా అందించిన విజయోత్సాహంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో ప్రయోగానికి సిద్దమవుతున్నాను. నెకెడ్ నంగా నగ్నం అనే చిత్రాన్ని మళ్లీ ఆర్జీవి వరల్డ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ టీజర్ అంతా పెద్దలకు మాత్రమే చిత్రంగా రూపొందిందనే విషయం ఫస్ట్ షాట్‌లోనే స్పష్టమైంది.

ఓ మహిళకు, ఇంట్లో పనిచేసే వ్యక్తికి మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలను పచ్చిగా చూపించారు. కెమెరాను ఎక్కడెక్కడో పెట్టి మహిళ అందాలను చిత్రీకరించడం వర్మ టేస్ట్, మేకింగ్‌ను తెలియజెప్పింది.
అయితే ఈ సినిమాను RGV World Theatre లో రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా టికెట్ ధర రూ.200 అని ప్రకటించారు. అయితే ఆ సినిమారిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
ఇదిలా ఉండగా, వర్మ తీసిన క్లైమాక్స్ సినిమా 24 గంటల్లోనే రూ.2 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దీంతో వర్మ తన సినిమాలను తన యాప్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Click it and Unblock the Notifications











