RGVకి షాక్.. పవర్‌స్టార్ ఫుల్ హెచ్‌డీ మూవీ లీక్.. తమిళ్ రాకర్స్ ఎటాక్
దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పవర్ స్టార్ మూవీ జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అంతేకాకుండా ఈ సినిమా అనేక విమర్శలకు, వివాదాలకు కారణం కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. అలా ఎప్పుడెప్పుడు చూడాలనే ఈ సినిమా పైరసీ కోరల్లో చిక్కుకోవడంతో వర్మకు మరో షాక్ గట్టిగా తగిలిందనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమా లీక్ గురించి వివరాల్లోకి వెళితే..

పవర్‌స్టార్‌పై క్రేజ్
ఆర్జీవి రూపొందించిన పవర్ స్టార్ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఊహించినట్టుగానే ఎక్కువగానే అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన కనిపించింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దాంతోపాటు ఈ సినిమాకు పోటీగా ఆర్జీవిపై సెటైరికల్ మూవీగా నూతన్ నాయుడు దర్శకత్వంలో వచ్చిన పరాన్నజీవి కూడా ప్రేక్షకులకు ముందే ఒకేసారి రావడంతో ప్రమోషన్‌ను భారీగా చేశారు.

రిలీజ్‌కు ముందు వాడివేడి చర్చ
ఇక పరాన్నజీవి, పవర్ స్టార్ సినిమాల పోటీ పెరగడంతో సినిమా రిలీజ్‌కు ముందు రాంగోపాల్ వర్మ, నూతన్ నాయుడుకు మధ్య వాడివేడి చర్చ జరగడంతో సినీ ఇండస్ట్రీలో ఉద్రిక్తత నెలకొన్నది. ఇలాంటి విషయాలు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు, సామాన్య ప్రజలు కూడా చర్చించుకొనే స్థాయికి వెళ్లడం గమనార్హం.

లాక్‌డౌన్‌లో జోష్ పెంచిన సినిమాలు
లాక్‌డౌన్ పరిస్థితుల్లో సినిమాలు లేకపోవడంతో వినోదం కరువైన ప్రేక్షకులకు పవర్ స్టార్, పరాన్నజీవి సినిమాలు ఎంటర్‌టైనర్‌మెంట్ అందించేందుకు, సినీవర్గాల్లో జోష్ పెంచేందుకు ఈ రెండు చిత్రాలు కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవర్‌స్టార్ సినిమాను పైరసీ రక్కసి కాటుకు గురైంది.

విడుదలైన కొద్దిసేపటికే పైరసీ బారిన
పవర్‌స్టార్ సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే ఈ సినిమా పైరసీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. ఈ సినిమాను మూవీ రూల్జ్స్, తమిళ రాకర్స్ వెబ్‌సైట్ రిలీజ్ చేశాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. ఈ సినిమాను టికెట్ల కొనుగోలుపై దెబ్బ పడే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











