twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ధార్థ కాలేజీ బ్యాక్ సైడ్... రామ్ గోపాల్ వర్మ రూములో అమ్మాయిలు!

    |

    ఏపీలో జగన్ ప్రభుత్వం రావడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం స్వేచ్ఛగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

    హ్యాపీ మూడ్లో ఉన్న ఆర్జీవీ విజయవాడలో ఉల్లాసంగా విహరిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చదువుకున్న సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నలుగురు అమ్మాయిలతో కలిసి దిగిన ఓ సెల్ఫీ పిక్ హాట్ టాపిక్ అయింది.

    సిద్ధార్థ కాలేజీ బ్యాక్ సైడ్... రామ్ గోపాల్ వర్మ రూములో అమ్మాయిలు!

    సిద్ధార్థ కాలేజీ బ్యాక్ సైడ్... రామ్ గోపాల్ వర్మ రూములో అమ్మాయిలు!

    తాను చదవుకుంటున్న రోజుల్లో విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వెనక వైపు ఒక రూములో ఉండేవారు. ఈ రోజుల్లో తాను నివాసం ఉన్న ఆ రూమును తాజాగా రామ్ గోపాల్ వర్మ సందర్శించారు. ఇపుడు దాన్ని లేడీస్ హాస్టల్‌గా మార్చడంతో ఆ రూములో అమ్మాయిలు ఉంటున్నారట.

    ఇక్కడే శ్రీదేవి పోస్టర్లు చూస్తూ...

    ఈ రూములో నేను 2 సంవత్సరాలు నివాసం ఉన్నాను. ఇదే గోడపై శ్రీదేవి పోస్టర్ అంటించుకుని ఆమెను ఊహించుకుని డ్రీమ్స్‌లో విహరించే వాడిని. ఇపుడు ఈ నలుగురు అమ్మాయిలు ఇందులో ఉంటున్నారు... అంటూ వారితో కలిసి దిగిన పిక్ వర్మ షేర్ చేశారు.

    పైపుల రోడ్డులో పంతం నెగ్గించుకున్న వర్మ

    ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్మ నివాళులర్పించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు పైపుల రోడ్డులోనే మీడియాతో మాట్లాడిన ఆయన తన పంతం నెగ్గించుకున్నారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    కాగా.... లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో మే 21న విడుదల చేయబోతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

    English summary
    "This is a room i stayed for more than 2 years in Siddhardha engineering college hostel back in my student days ..it has now become a girls hostel and these lovely girls are it’s present room mates ..I used to have a Sridevi poster stuck on the wall behind me." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X