twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో కాంట్రవర్సీ కథతో సిద్ధమైన అర్జీవి.. ఆ వెబ్ సిరీస్ ఆగిపోలేదట!

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. కాంట్రవర్సీల డోస్ మరో లెవెల్ కి పెంచిన ఈ సీనియర్ డైరెక్టర్ ప్రస్తుతం లాక్ డౌన్ లో కొత్త స్క్రిప్ట్ లను సిద్ధం చేస్తున్నాడు. కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు ట్వీట్స్ చేస్తున్న వర్మ.. ఫాలోవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. ఇకపోతే ఆగిపోయిందనుకున్న ఒక ప్రాజెక్ట్ ని వర్మ మళ్ళీ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

    అప్పట్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో కడప అనే ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు సగం షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. కానీ ఎందుకో ఆ సిరీస్ పై వర్మ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే చాలా కాలం తరువాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనులపై వర్మ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ దిశ ఘటనకు సంబంధించిన సినిమాను రెడీ చేస్తున్నాడు. ఎక్కువగా డాక్యుమెంటరిస్ చూస్తున్న అర్జీవి త్వరలో కరోనా వైరస్ నేపథ్యంలో కూడా మరొక కొత్త తరహా సినిమాను ప్లాన్ చేయనున్నాడు.

    RGV said that he is making a web series called Kadapa

    ఇక వాటితో పాటు కడప వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేయాలని అర్జీవి ప్లాన్ చేసుకుంటున్నాడు. అర్జీవి హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ఎన్ని కాంట్రవర్సీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్నా కూడా వర్కౌట్ కావడం లేదు. దీంతో నెక్స్ట్ సినిమాలతో అయినా మినిమామ్ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. దిశ ఘటనకు సంబంధించిన సినిమాపై త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    it’s a given that one would expect a film on Corona from director RGV. Especially when he had already claim that he was supposed to make a film on a deadly virus several years ago. RGV has just announced a film based on Coronavirus. and RGV said that he is making a web series called Kadapa. It is going to be quite hard-hitting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X