For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ : అషూ రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి అంటూ.. అసలు విషయం ఓపెన్ అయిన వర్మ!

  |

  ఒకప్పుడు కేవలం సంచలన సినిమాలకు మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం సంచలన విషయాలకు, వివాదాస్పద అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. అసలు ఎలాంటి దాపరికాలు లేకుండా తన మనసులో ఏది అనుకుంటే అది చెప్పేస్తూ జనాల్లో అలజడి రేపే వర్మ ఈ మధ్యకాలంలో ఒక నటి తో అసభ్యంగా డ్యాన్స్ చేస్తూ ఆమె కాళ్ల మీద పడి దండం పెడుతూ వార్తల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత మా ఇద్దరికీ లేని నొప్పి మీకెందుకు అంటూ దాన్ని కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డితో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో ఉన్నది తాను కాదని పేర్కొన్న వర్మ ఇప్పుడు ఎట్టకేలకు ఆ విషయంలో ఓపెన్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  అలా సినిమాల మీద ఆసక్తి

  అలా సినిమాల మీద ఆసక్తి

  విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వర్మ తన తండ్రికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు.. ఒక పక్క వీడియో లైబ్రరీ నడుపుతూనే సినిమాల మీద ఆసక్తితో అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ చూడటానికి వర్మ వెళ్లేవారు.. ఆ సినిమాల షూటింగులు చూస్తూ చూస్తూ సినిమా ఎలా అయినా దర్శకత్వం వహించాలని భావించి వర్మ కాలేజీ అనుభవాలతో ఒక కథ అనుకుని దానిని సినిమాగా చేయాలని అనుకున్నారు.

   ట్రెండ్ సెట్టర్

  ట్రెండ్ సెట్టర్

  అలా మొట్టమొదటి అటెంప్ట్ తోనే శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించడమే కాక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఒక రకంగా ఇవాల్టి రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సగానికిపైగా టాప్ డైరెక్టర్లు వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారే.ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వర్మను రోల్ మోడల్ గా తీసుకుని ఎంతో మంది దర్శకత్వం వైపు అడుగులు వేశారు.. అయితే ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంత మంది దర్శకత్వం వైపు వస్తుంటే వర్మ మాత్రం కొన్నాళ్లుగా అసలు దర్శకత్వం మీద మనసు పెట్టడం మానేశారు.

  నో ఫోకస్

  నో ఫోకస్

  కొన్నాళ్ళ క్రితం వరకు దర్శకుడిగా తన పేరు వేసుకున్న వర్మ ఇప్పుడు దర్శకుడిగా కూడా తన పేరు వేసుకోవడం లేదు. తన శిష్యులు ఎవరైతే సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారో వాళ్ళ పేర్లతో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే అది వర్మ సినిమా అనే పేరు వస్తోంది. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే వర్మ నుంచి దాదాపు అయిదారేళ్ళ క్రితం వచ్చిన వంగవీటి సినిమా హిట్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వర్మ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకొలేదు. ఆ సినిమా తర్వాత వర్మ నుంచి దాదాపు పది సినిమాలు బయటికి వచ్చినా ఒక్క సినిమా కూడా బాగుంది అనుకోవడానికి లేదు.. అయితే సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా వర్మ ఇప్పుడు ఎక్కువగా వివాదాస్పద అంశాలలో హైలెట్ కావడానికి చూస్తున్నాడు..

   మీకేం నొప్పి

  మీకేం నొప్పి

  మొన్న ఇనయా సుల్తానా అనే ఒక నటితో అసభ్యకరంగా డాన్సులు వేస్తూ ఆ వీడియోను స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.. అప్పటికే ఆ వీడియో అనేక విధాలుగా బయట వైరల్ అయింది. వర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో మరింత వైరల్ అయింది. ఇంకేముంది ఆడపిల్లతో అలాంటి అసభ్యకరమైన డాన్సులు ఏంటి అని కొంతమంది సూటిగా ప్రశ్నిస్తుంటే చాలా మంది సోషల్ మీడియాలో మీడియాలో వర్మ ను ప్రశ్నించారు.. అయితే తామిద్దరం మేజర్లమని మా ఇద్దరికీ లేని నొప్పి నీకేంటి ? అని వర్మ వాళ్ళ నోళ్ళు మూయించే ప్రయత్నం చేశారు. ఆ సంగతి పక్కన పెడితే మళ్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి తో వర్మ వీడియో కూడా వైరల్ అయింది.

  Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
  ఐస్ క్రీమ్ తింటూ సెక్స్

  ఐస్ క్రీమ్ తింటూ సెక్స్

  దానిని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వర్మ ఇందులో ఉన్నది అషు రెడ్డి కాదని అలాగే మరో వ్యక్తిని తాను కాదని వాళ్ళు ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.. అరియానాలాగా ఈమెతో ఏమీ ఇంటర్వ్యూ చేయడం లేదని అసలు ఈ వీడియో ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.. అక్కడితో వదిలేస్తాడు అనుకుంటే రెండు రోజుల క్రితం అషు రెడ్డి తొడలు కనిపించేలా కొన్ని ఫోటోలు తీసి వదిలాడు వర్మ. ఈ రోజు ఏకంగా ఆ ఫోటోలో ఉన్నది తామేనని తాను అషు రెడ్డి తో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నాము అని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాల కు విడుదల చేస్తున్నామని కచ్చితంగా ఆ పోస్టర్ చూడాలని వర్మ పేర్కొన్నారు. ముందు నుంచి అసలు నాకు అషు రెడ్డి ఎవరో తెలియదు అన్నట్టుగా చెప్పుకొచ్చిన వర్మ ఇప్పుడు ఆమెతో ఐస్ క్రీమ్ తింటూ ఏకంగా సెక్స్ గురించి మాట్లాడాను అని పేర్కొనడంతో మళ్ళీ రచ్చ రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Ram Gopal Varma says me and Ashu Reddi having ICE CREAM and talking about SEX, Interview poster releasing tmrw August 30 th at 6 pm 9 minutes (pun not intended).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X