ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్‌తో పోల్చిన ఆర్జీవీ

వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ప్రధాన మంత్రిని జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చడం గమనార్హం.

హిట్లర్ ఒక చిన్నారి చెవులు పట్టుకుని ఉన్న ఫోటోను పోలిన నరేంద్రమోదీ పిక్ పిక్ వర్మ షేర్ చేశారు. 'సేమ్ టు సేమ్' అంటూ కామెంట్ పెట్టారు. వర్మ చేసిన ఈ పోస్టులో నెటిజన్లు చాలా అర్థాలు తీస్తున్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.

RGV shared Narendra Modi and Adolf Hitler pic

అయితే వర్మ పోస్ట్ చేసిన పిక్ రియల్ కాదని... ఫోటోషాప్ చేసిన పిక్ అంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేశారు. వర్మకు బయోపిక్స్ తీసీ తీసీ రియల్ ఫోటోలకు, ఫేస్ ఫోటోలకు తేడా తెలియకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తన మరో ట్వీట్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ గురించి ప్రస్తావించారు రామ్ గోపాల్ వర్మ. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని అనకాపల్లిలో బలవంతంగా అడ్డుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఈ సందర్భంగా షేర్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి నిర్మాతగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా.... ఎన్నికల కోడ్ అమలులో ఉందనే కారణంతో ఈసీ ఈ చిత్రాన్ని ఆపివేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X