వామ్మో వర్మ హీరోయిన్ మామూలుగా లేదే.. బీచ్‌లో అమాంతం అలా.. షాకింగ్ పిక్!!
వర్మ సినిమాలంటేనే అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఆయన స్టాండర్డ్స్‌లో సినిమా వచ్చి చాలా కాలమే అయింది.ఈ మధ్య తీసిని ఏ చిత్రాలు కూడా అంతగా వర్కౌట్ కావడం లేదు. అయినా సరే వెనకడుగన్నది తన వంశంలో లేనట్టుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వర్మ తన ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తాడు.

పొలిటికల్ సెటైర్స్..
మామూలుగా వర్మ రౌడీయిజం, గ్యాంగ్‌స్టర్, ఫ్యాక్షన్ సినిమాలను తెరకెక్కిస్తాడు. ఈ మధ్య అయితే మరీ పొలిటికల్ సెటైర్స్ ఎక్కువయ్యాయి. అందులో భాగంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రాలు వచ్చాయి. ఇవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి.

ప్రకటనలకే పరిమితం..
అయితే ఈ రెండు చిత్రాల తరువాత హైద్రాబాద్ రౌడీయిజం మీద ఓ సినిమా చేస్తానని, కేసీఆర్ బయోపిక్ ఆధారంగా మరో చిత్రాన్ని చేస్తానని ప్రకటించాడు. అయితే అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఏ ఒక్కటి కార్యరూపం దాల్చేట్టు కనిపించడం లేదు.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో..
తన కెరీర్‌లోనే యాంబీషియస్ సినిమా అంటూ .. భారతదేశం నుంచి రాబోతున్న తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అంటూ వర్మ ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఆ మధ్య ట్రైలర్, టీజర్ ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. తాజాగా మరోసారి ఈ చిత్రం వార్తల్లోకెక్కింది.

వేడి పుట్టిస్తున్న పూజా..
ఈ రోజు ఉదయమే బీచ్‌లో పరిగెత్తుతున్న పూజా అందాలను చూపిస్తూ ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. తాజాగా వర్మ షేర్ చేసిన పిక్ చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. పూజా హై రేంజ్‌లో కిక్ ఇస్తున్నట్లు పోజ్ పెట్టింది. తన కాలును అమాంతం పైకి లేపేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎవ్వరూ కూడా ఇలాంటి కిక్ కావాలని కోరుకోడంటూ వర్మ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











