For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోడి నా కొడుక్కే(రాజమౌళి) అంత ఉంటే నాకెంతుండలి.. తండ్రి ముందే జక్కన్నపై RGV షాకింగ్ కామెంట్స్!

  |

  టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ఎక్కువగా ఆయన చెప్పే మాటలకే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటాటూ. ఒక విధంగా ఆర్జీవి సినిమాల కంటే కూడా ఆయన చెప్పే మాటలు ఇటీవల కాలంలో బాగా క్రేజ్ అందుకుంటున్నాయి.

  ఎలాంటి విషయంలో ఆయినా ఆర్జీవి ఆలోచనా విధానం విబిన్నంగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇటీవల ఈ కాంట్రవర్సీ దర్శకుడు ఒక సినిమా ఈవెంట్ లో కూడా ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు. రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి పేరు కూడా ప్రస్తావించడం విశేషం.

  వివాదం ఎక్కువగా ఉండే కథలపై ఫోకస్

  వివాదం ఎక్కువగా ఉండే కథలపై ఫోకస్

  ఒకప్పుడు శివ, సత్య, రంగీలా, సర్కార్, కంపెనీ, వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఓటీటీ కంటెంట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత వరకు వివాదం ఎక్కువగా ఉండే కథలను మాత్రమే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు.

  అయితే సినిమాలో మాత్రం ఆకట్టుకోలేకపోయాయి అయినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ఆయన ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో అభిమానులు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమా యూనిట్కు వెళ్లి ఎక్కడ బయటకు చంద్ర ప్రసాద్ గడ్డపై కూడా విభిన్నమైన తరహాలో వివరణ ఇచ్చారు.

  ఎవరికి నమస్కారం పెట్టను

  ఎవరికి నమస్కారం పెట్టను

  'కనబడుట లేదు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన వర్మ వేడుకల్లో మాట్లాడుతూ... వేడుకకు విచ్చేసిన అందరికీ, వేదికను అందించిన పెద్దలందరికీ నమస్కారం చెప్పట్లేదు. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఎవరికి నమస్కారం పెట్టింది లేదు. అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా కనబడుటలేదు గురించి మాట్లాడటానికి ముందు నాకు ఒక డౌట్. ఇందాక రైటర్ విజయేంద్రప్రసాద్ గారిని ఒక విషయం అడుగుదామని అనుకున్నా కానీ మ్యూజిక్ ఎక్కువగా ఉండడం వలన ఆయనకి అర్థం కాదేమో అని చెప్పలేదు.

  బోడి నా కొడుకు రాజమౌళి..

  బోడి నా కొడుకు రాజమౌళి..

  గత కొన్ని వారాలుగా నేను విజయేంద్రప్రసాద్ గారిని గమణిస్తున్నాను. నా పెద్ద పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కాదను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? ఇక నా గెస్సింగ్ ఏమిటంటే.. బోడి నా కొడుకు రాజమౌళిదే అంత ఉంటే నాది ఇంకెంత పెద్దగా ఉండాలి.. అది నా కరెక్ట్ అని నా ఫీలింగ్ అని దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ మాటలకు రైటర్ విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. ఇక వర్మ మాటలకు అక్కడ జనాలు విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టారు.

  కె.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ

  కె.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ

  ఇక అంతకుముందు సినిమా గురించి మాట్లాడుతూనే కె.విజయేంద్రప్రసాద్ రామ్ గోపాల్ వర్మ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 32 సంవత్సరాల క్రితం అనుకుంటా.. 1989 లో ఇండస్ట్రీలోకి ఒక యువ కెరటం వచ్చింది. సినిమా తీస్తానని చెప్పారు. ఎక్కడ పని చేయలేదు. ఎక్కడ సినిమా చేసిన అనుభవం లేదు. కానీ ఒక ఫ్యాషన్ తోనే సినిమా తీశాడు కాలేజీ కుర్రాళ్ళ తోటి సైకిల్ చైన్ పట్టించాడు.. అయితే నాకు ఆ మనిషి కనిపించడం లేదు.

  శ్రీదేవి అందాలను..

  శ్రీదేవి అందాలను..

  ఆ తర్వాత శ్రీదేవి అందాలను అందరికంటే ఎక్కువ అద్భుతంగా చూపించారు. జామురాతిరి జాబిలమ్మ అనే పాటతో కుర్రకారుకు పిచ్చెక్కించాడు. అలాంటి దర్శకుడు కూడా కనిపించడం లేదు. ఆ తర్వాత సత్య, రంగీలా, కంపెనీ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి కొన్ని వందల మంది డైరెక్టర్లను టెక్నీషియన్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. అలాంటి రామ్ గోపాల్ వర్మను తొందరగానే చూడాలని కోరుకుంటున్నాను అని తనదైన శైలిలో గురించి మాట్లాడారు.

  కనబడుట లేదు

  కనబడుట లేదు

  కనబడుట లేదు సినిమా విషయానికి వస్తే సునీల్ ఈ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు ప్రభుత్వం సినిమాలు కొత్త వారు ఎక్కువగా నటిస్తున్నారు. త్వరలోనే విడుదల కాబోయేసినిమాకు తప్పకుండా విజయం సాధించాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రసాద్ చిత్ర యూనిట్ కి వారి బెస్ట్ విషెస్ ను అందించారు.

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
  వారి సినిమాల విషయానికి వస్తే..

  వారి సినిమాల విషయానికి వస్తే..

  కె.విజయేంద్రప్రసాద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రాసిన RRR సినిమా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RRR అక్టోబర్ 13న రాబోతున్నట్లు పోస్టుల ద్వారా తెలియజేశారు. పరిస్థితులు అనుకూలిస్తే తప్ప అనుకున్న తేదీకి సినిమా రాకపోవచ్చని ఇటీవల మరొకరు మరైతే ఎర్రగా మారింది. అంతేకాకుండా విజయేంద్రప్రసాద్ నెక్స్ట్ మహేష్ బాబు సినిమా కోసం కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఒక కొత్త తరహా కథను అందించబోతున్నారు. అలాగే రామాయణం ఆధారంగా సీతమ్మ తల్లి పాత్రతో ఒక కథను తయారు చేసుకొని ఒక స్టార్ దర్శకుడికి అందించిన పోతున్నట్లు సమాచారం.

  English summary
  Rgv shocking comments on k vijayendra prasad at kanabadutaledu event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X