KGF స్టమక్ పంచ్ మామూలుగా లేదు.. బాహుబలి, RRR సినిమాపై RGV సెటైర్..
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తాడు. సినిమాలతో హిట్స్ అందుకోకపోయినా కూడా ట్వీట్స్ మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఇక చాలా రోజుల తరువాత ఒక పాన్ ఇండియా సినిమాను పొగుడుతూ కనిపించిన వర్మ పనిలో పనిగా రాజమౌళి సినిమాలపై ఒక చిన్న సెటైర్ కూడా వేసేశాడు.

KGF రికార్డుపై వర్మ కామెంట్
రామ్ గోపాల్ వర్మ ఏ విషయంపై స్పందించినా కూడా కూడా అది వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇటీవల KGF సినిమాను ఆకాశానికి ఎత్తే క్రమంలో మిగతా ఇండస్ట్రీలోని సినిమాలకు పంచ్ పడిందని గట్టిగానే సెటైర్స్ వేశాడు. KGF 2 సినిమా ఇటీవల టీజర్ తో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అదే విషయంపై వర్మ వివరణ ఇచ్చాడు.

దండం పెట్టిన RGV
రెండేళ్ల క్రితం బాలీవుడ్ అలాగే సౌత్ ఇండస్ట్రీలోని ఇతర ఇండస్ట్రీలు కన్నడ సినిమా ఇండస్ట్రీవైపు కూడా తిరిగి చూసేవారు కాదని చెప్పిన వర్మ ఇప్పుడు KGF సినిమా వరల్డ్ మ్యాప్ లో పెట్టేసిందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశంసించారు. అలాగే దండం పెడుతూ కూడా ట్వీట్ చేశారు.

బాహుబలి, RRR కంటే ఎక్కువ స్థాయిలో..
ఇక మరో ట్వీట్ లో అయితే.. బాహుబలి 2 ట్రైలర్ మూడేళ్ళలో కేవలం 11కోట్ల వ్యూవ్స్ ను అందుకుందని, ఇక RRR అంతే సమయంలో 3.8కోట్ల వ్యూవ్స్ ను అనుకుందని అన్నారు. కానీ KGF 2 టీజర్ మాత్రం మూడు రోజుల్లోనే 14కోట్ల వ్యూవ్స్ ను అందుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఒక విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టమక్ పంచ్ ఇచ్చాడని అంటూ.. కన్నడిగుల తరపున కూడా ఆ దెబ్బ కట్టిగానే పడిందని అన్నారు.

క్రాక్ సినిమాపై కామెంట్
వర్మ KGF ను ఆకాశానికి ఎత్తివేస్తూ చేసిన ట్వీట్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక క్రాక్ సినిమాపై కూడా ఆర్జీవి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. జనాలు మళ్ళీ సినిమా థియేటర్లకు వచ్చేలా చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి కంగ్రాట్స్ తెలిపారు. అలాగే రవితేజ కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ మూవీ అని అన్నారు. ఇక వర్మ నెక్స్ట్ D కంపెనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











