RRR ప్లాప్ అయితే బట్టలిప్పేసి డ్యాన్స్ చేస్తారు..సక్సెస్ అయితే చచ్చిపోతారు:ఆర్జీవి షాకింగ్ కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే అని మరోసారి రుజువు చేశాడు. ఎలాంటి విమర్శలకైనా గట్టిగా కౌంటర్ ఇచ్చే వర్మ ఈ సారి RRR సినిమాపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్లాప్ అయితే ఎలా ఉంటుంది అనే ఊహలపై మొదటిసారి స్పందించాడు అర్జీవి.

ఇండస్ట్రీలో పెద్ద బూతు..
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖుల మధ్య విబేధాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. అయితే చాలా వరకు సెలబ్రెటీస్ మేమంతా ఒకటే.. అందరం కలిసి మెలిసి ఉంటాం అని అంటుంటారు. అదే విషయంపై ఇటీవల స్పందించిన ఆర్జీవి అలా ఎవరైనా చెబితే అంతకంటే పెద్ద బూతు పదం మరొకటి ఉండదని షాకింగ్ కామెంట్ చేశారు.

RRRపై కామెంట్..
ప్రస్తుతం ఆర్జీవి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఒక వైపు బయట విషయాల గురించి స్పందిస్తూనే తన క్లైమాక్స్ సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. ఆ సినిమా నిన్న రాత్రే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని రిజల్ట్ ఏమిటనేది మరికొన్ని గంటల్లో బయటపడుతుంది. ఇక సడన్ గా ఆర్జీవి RRR సినిమాపై కూడా ఒక కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్లాప్ అయితే..
సాధారణంగా ఆర్జీవి పెద్ద సినిమాలపై తనదైన శైలిలో ఎదో ఒక కామెంట్ చేసి హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా మారోసారి దర్శకధీరుడు రాజమౌళిపై ఇండస్ట్రీలో ఉండే అసలైన అభిప్రాయాన్ని తనదైన శైలిలో బయటపెట్టాడు. ఒకవేళ RRR సినిమా ప్లాప్ అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు బయటకు వచ్చి చొక్కాలు విప్పేసి మందు బాటిల్స్ పొంగిస్తూ ఎగిరి గంతేస్తారని అన్నారు.
Recommended Video

అందరిలో ఉంటుంది..
నిజానికి అంత భారీ విజయాన్ని ఎవరు తట్టుకోలేరు. సాధారణంగా కుళ్లు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మానవ నైజం. ఇక రాజమౌళి అంత సక్సెస్ అయితే చచ్చిపోవడం మేలు అనేంత అసూయ చెందుతారు. పాలిటిక్స్ లో అయినా బిజినెస్ లో అయినా ఒకరు ఎదుగుతుంటే ఎవరు తట్టుకోలేరు. అది అందరిలో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అలానే ఉంటుంది అని రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











