సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.. ఇంకా నీకు బుద్ధి రాలేదా? నీ ఖర్మ అంటూ.. పెళ్లి కూతురుపై కూడా
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ చేసిన కూడా వైరల్ అవ్వడం కామన్. నేటి సమాజంలో ప్రతి విషయంలో ఉండే కాంట్రవర్సీ పై కూడా అందరూ ఆర్జీవి రెస్పాన్స్ గురించి ఆలోచిస్తారు. ఇక ప్రస్తుతం అక్కినేని హీరో సుమంత్ పెళ్లిపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతుండడంతో ఆర్జీవి కూడా తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు. వర్మ ఈ రేంజ్ లో షాక్ ఇస్తాడాని ఎవరు ఊహించలేదు. ఆఖరికి పెళ్లి కూతురిపై కూడా అదే రేంజ్ లో కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

గత రాత్రి నుంచి పెళ్లి కార్డ్ వైరల్
గత రాత్రి నుంచి సుమంత్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడాని పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక పెళ్లి కార్డుకు సంబంధించిన ఫొటో కూడా బాగానే వైరల్ అయ్యింది.

సుమంత్ మొదటి సినిమా..
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పెళ్లిపై కూడా ఊహించని విధంగా స్పంధించడం హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని వారితో రాముకి చాలా సాన్నిహిత్యం అయితే ఉంది. సుమంత్ తో కూడా ఆర్జీవి డైరెక్ట్ చేసిన ప్రేమకథ అనే సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

ఆర్జీవితో స్నేహం..
ఇక 2004లో తొలిప్రేమ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న సుమంత్ అనంతరం ఆమెతో సెట్టవ్వక రెండేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. అప్పటి నుంచి కెరీర్ చాలా ఫోకస్ చేశాడు. కానీ ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా అతనికి కలిసి రాలేదు. ఇక ఆర్జీవి ప్లాప్ ఇచ్చినప్పటికీ అతనితో సుమంత్ కు మంచి స్నేహం ఉంది.

నీకు ఇంకా బుద్ధి రాలేదా?
ఇక రెండో పెళ్లి గురించి తెలియగానే వర్మ చేస్తున్న ట్వీట్స్ సుమంత్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మను అనుభవించండి.. అంటూ రామ్ గోపాల్ వర్మ సుమంత్ ను సైతం ట్యాగ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

తప్పు మీది కాదు..
ఇక మరొక ట్వీట్ లో.. ఒక పెళ్లంటేనే నూరేళ్ళ పెంట అయితే.. రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి అంటూ ప్రశ్నించారు. నా మాట విని మనెయ్యి. పవిత్ర గారు మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది కాదు. సుమంత్ ది కాదు. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్తది.. అని రామ్ గోపాల్ వర్మ తన బాణాలను వదిలారు. మరి ఈ ట్వీట్స్ పై సుమంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











