హే పీకే ఫ్యాన్స్..యే హమారా ఇజ్జత్‌ కా సవాల్‌ హై.. కత్తి పట్టుకొని RGV వార్నింగ్!

విలక్షణ దర్శకుడు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనమే అని మారోసారి నీరూపించాడు. మొన్నటివరకు హాట్ మసాలా సినిమాలతో షాక్ ఇచ్చిన ఆర్జీవి ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ కి డిజ్ లైక్స్ ఎక్కువగానే వచ్చాయి. దీంతో వర్మ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Power Star movie Gaddi Tintava Song Dislikes: RGV VS PK Fans Clash
నిమిషాల్లోనే వైరల్..

నిమిషాల్లోనే వైరల్..

పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన మొదటి పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన వర్మ నిమిషాల్లోనే దాన్నీ వైరల్ అయ్యేలా చేశాడు. గడ్డి తింటావా అనే ఆ పాటపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిస్ లైక్స్ కొట్టడమే కాకుండా వర్మకు వార్నింగ్ లు ఇస్తుండడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

అభిమానుల పవర్ ఇంతేనా?

అభిమానుల పవర్ ఇంతేనా?

పవర్ స్టార్ సాంగ్ కి 5 గంటల్లోనే 5లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. అయితే అప్పటికి 20వేల డిస్ లైక్స్ రావడంతో నేను ఈ విషయంలో పీకే అభిమాని అయినందుకు చాలా బాధపడుతూన్నాను అంటూ కేవలం 20వేల డిస్ లైక్స్ రావడం చూస్తుంటే ఆయనకు ఇంత తక్కువ మంది అభిమానులు ఉన్నారా? అని అనిపోస్తోందని వర్మ ట్వీట్స్ తో రెచ్చగొడుతున్నాడు.

కత్తిపట్టుకున్న వర్మ..

కత్తిపట్టుకున్న వర్మ..

ఇక మరో పోస్టర్ తో వర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. పవర్ స్టార్ ని రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ లుంగీలో కత్తి పట్టుకున్న ఫొటోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. అంతే కాకుండా అభిమానులను రెచ్చగొడుతూ.. 'హే పీకే ఫ్యాన్స్..యే హమారా ఇజ్జత్‌ కా సవాల్‌ హై.. మీరు మరిన్ని డిస్ లైక్స్ కొట్టాలని కోరుకుంటున్నా అని చురకలు అంటించాడు.

RRRట్రైలర్ ని అలా రిలీజ్ చేస్తే..

RRRట్రైలర్ ని అలా రిలీజ్ చేస్తే..

చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఒక వైపు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూనే తన సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఇక పవర్ స్టార్ ట్రైలర్ ని ఈ నెల 22న ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేయనున్నట్లు చెబుతూ. RRR సినిమా ట్రైలర్ ని రూ.250 లేదా రూ.150లకు రిలీజ్ చేస్తే నిర్మాతలు ప్రాఫిట్స్ జోన్ లోకి వచ్చేస్తారని వర్మ వివరణ ఇవ్వడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X